వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని తెలుగుదేశం పార్టీకి చెందిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారులపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడం తగదన్నారు. ఆధారాలుంటే బయటపెట్టాలన్నారు. అలాగే ‘వైసీపీ అధికారంలోకి వచ్చేది లేదు... మా అంతు చూసేదిలేదు’ అని యరపతినేని అన్నారు. విజయసాయిరెడ్డి బెదిరింపు దోరణిని సహించేది లేదని, కూకటివేళ్లతో పెకిలించివేస్తాం అంటూ శ్రీనివాసరావు పేర్కొన్నారు. తాము పల్నాడు బ్రహ్మనాయుడి వారసులమని చెప్పారు.
వైఎస్ఆర్ పార్టీకి చెందిన A2 విజయసాయి రెడ్డి, ప్రాంతాల వారిగా టార్గెట్లు ఇచ్చి మరీ, మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు... ఉత్తరాంధ్రలో కళావెంకటరావు, రాయలసీమలో టీజీ వెంకటేశ్‌తో పాటు, గురజాల ఎమ్మెల్యే 'యరపతినేని శ్రీనివాసరావు, సిఎంఒ ఇన్‌ఛార్జి సతీశ్‌చంద్ర, ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుల సంగతి, ముఖ్యమంత్రిగా 'జగన్' ప్రమాణస్వీకారం చేసిన అరగంటనేలోనే చూస్తామని విజయసాయి రెచ్చిపోయారు... జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం, నేను కేంద్ర మంత్రి అవ్వటం ఖాయం, అవ్వగానే వీరి సంగతి చెప్తా అంటూ, విశాఖపట్నంలోని ఈ వ్యాఖ్యలు చేసారు...
దీని పై ఇప్పటికే అధికార వర్గాలు విజయసాయిని హెచ్చరించాయి... ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల సంఘాలు, వార్నింగ్ ఇచ్చాయి... తాజాగా, యరపతనేని కూడా ఘాటుగా స్పందించారు... నిజానికి సీనియర్ ఐఎఎస్,ఐపిఎస్ అధికారులపై, A1 జగన్, A2 విజయసాయి రెడ్డి రెచ్చిపోవటం కొత్త కాదు... జగన్ ఏమో, నెంబర్ వన్ ఐఎఎస్ ఆఫీసర్ గా పేరున్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుని, జైలుకి తీసుకుపోతా అని అన్నారు... ఒక సందర్భంలో నందిగామలో ప్రభుత్వ డాక్టర్ల పై దౌర్జన్యం చేసారు.. ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ అయితే, నా భూతో న భవిష్యత్తు... ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ నువ్వు అంటూ, రెచ్చిపోయారు... ఇప్పుడు జగన్ బాటలోనే A2 విజయసాయి రెడ్డి నడుస్తున్నారు... మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు...