రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ భాజపా నిన్న ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్‌ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చెప్పారు... కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని తెలిపారు... తాను కూడా రాయలసీమ బిడ్డనే అని చెప్పారు... బీజేపీకి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించిన ఆయన... రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలు ఆడుతోందంటూ మండిపడ్డారు.. ఎన్నడూ కవివినీ ఎరుగని రీతిలో రాయలసీమకు నీళ్లందించామన్నారు. అనంతలో కియా, చిత్తూరులో ఫాక్స్ కాన్ కంపెనీలను ఏర్పాటు చేస్తోంది తెదేపా ప్రభుత్వమేనని ప్రజలు గుర్తించారని చంద్రబాబు నేతలతో అన్నారు..

cb nbjp 24022018 2

కర్నూలులో సుప్రీంకోర్టు బెంచ్, అమరావతిలో దేశ రెండో రాజధానిని ఏర్పాటు చేస్తే... అప్పుడు బీజేపీ చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు... మరి బీజేపీ నేతలు ఎవరైనా, చంద్రబాబు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలరా ? అంతే కాదు, సొంత పార్టీ నేతలకు క్లారిటీగా చెప్పారు.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినా, పోరాటం చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు... దీంట్లో ఎలాంటి రాజకీయాలకు తావులేదన్నారు. భాజపా నేతలపై వ్యక్తిగత విమర్శలకు దిగొద్దని సూచించారు. విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్ర ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం తప్పలేదన్నారు...

cb nbjp 24022018 3

నిన్నటి నుంచి బీజేపీ పై సోషల్ మీడియాలో కూడా బీజేపీ వైఖరి పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరుచుకుపడుతున్నారు... మీరు పాలించే అన్ని రాష్ట్రాల్లో రెండు రాజధానులూ రెండు అసెంబ్లీలూ పెట్టారా? అసలు అమరావతి రాజధానికే దిక్కు లేదు... రెండోది కట్టాలా? ముందు చెయ్యాల్సినవి చెయ్యండి, లేకపోతే మీరే రాయలసీమలో కట్టండి.... దక్షణ భారత నినాదాలు చేస్తుంటే, ఇలా మాట్లాడకూడదు అన్న మీరే, ఇలా ఎందుకు చేస్తున్నారు ? సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు సంస్థానాలని కలిపితే....ఆయన వారసులు అని చెప్పుకునే మీరు ప్రాంతీయతను రెచ్చగొట్టి పబ్బమ్ గడుపుకోవాలి అని చూస్తున్నారు,నిస్సిగ్గుగా... ఆంధ్రులుగా మా హక్కును అడిగితే ప్రాంతీయతను రెచ్చగొట్టి కుక్కలు చింపిన విస్తరి చెయ్యలనుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో బీజేపీ వైఖరి పై పోస్ట్ లు పడుతున్నాయి..

Advertisements

Advertisements

Latest Articles

Most Read