తన కేసు విషయంలో, ప్రధానికి నోటీసులు వచ్చాయని చెప్పి గురువారం పొద్దున్నే హైదరాబాద్ చెక్కేసిన జగన్, నిన్న శుక్రవారం కోర్ట్ కి వెళ్లి సంతకం పెట్టి, ఈ రోజు శనివారం మళ్ళీ తన ముఖ్యమంత్రి కుర్చీ యాత్ర మొదలు పెట్టాడు.. ఈ రోజు 96వ రోజు అంటూ ప్రశాంత్ కిషోర్ టీం లెక్కలు చెప్తుంది...మరి అది శుక్రవారాలతో కలిపో, లేక కలపకుండానో తెలియదు కాని, ఈ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని హాజీస్‌పురం నుంచి మొదలై, టకారిపాలెం వద్ద ముగిసింది... అయితే, ఈ రోజు పాదయాత్రలో ఎంత పని జరిగిందో తెలుసా ? పాదయత్రకు వచ్చిన వారు బెంబేలెత్తిపోయారు...
పాదయాత్రకు జగన్ వెంట నడుచుకుంటూ వస్తున్న వారి, పై దునుగా చేసుకున్న కొందరు జేబు దొంగలు చేతివాటం చూపించారు... జగన్‌ను చూడటానికి వచ్చిన ఓ కాలేజ్ కరెస్పాండంట్ వద్ద రూ. 1 లక్ష, మరొకరి వద్ద రూ. 70వేల నగదు, ఓ మహిళ వద్ద చైన్‌ను జేబు దొంగలు అపహరించారు... జగన్ కడప నుంచి తెచ్చుకున్న ప్రైవేటు సెక్యూరిటీ వాళ్ళ జేబులో డబ్బులు కూడా కొత్తెసారు దొంగలు... బాధితులంతా స్థానిక పీఎస్‌లో ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది....
అయినా వర్షంలోకి గొడుగు లేకుండా వెళ్ళి మేము తడిచాం అని కంప్లెయింట్ చెయ్యకూడదు... అట్టానే జే గ్యాంగ్ గుంపులోకి జేబుల్లో లచ్చలు పెట్టుకొని వెళ్ళి ఇప్పుడు పొయ్యాయి అని లబో దిబో అనకూడదు... తెలిసి తప్పు చేస్తే ఎవడేమి చేస్తాడు... ఆ బ్యాచ్ సంగతి తెలిసి కూడా, కట్టలు కట్టలు డబ్బులు, మెడలో బంగారాలు దిగేసుకుని వెళ్తే, ఆ బ్యాచ్ వదిలిపెట్టుద్దా ? పోయింది ఎదో పోయింది, ఇక నుంచి అయినా జాగ్రత్త పడండి... అంతకు మించి చేసేది ఏమి లేదు...