మన రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా, కేంద్రం చేస్తున్న అన్యాయం పై, ప్రజలందరూ ఆందోళన చేస్తున్నారు, పార్టీలకు అతీతంగా, అందరూ కేంద్రం పై ఆందోళనలు చేస్తున్నారు... సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మేము ఈ దేశంలో భాగం కాదా అంటే, కనీస స్పందన లేదు... పైగా రాష్ట్ర బీజేపీ నాయకులు, రాష్ట్ర సమస్యలు వదిలేసి, మోడీ, అమిత్ షా భజన చేస్తున్నారు... ఇంత ఆందోళన జరుగుతున్నా, ఢిల్లీ పాలకులకి కనీస స్పందన లేదు... మన సమస్యల గురించి ఆలోచించేవారు కానీ, ఆలకించేవారుకానీ, ఒక్కడు కూడా ఢిల్లీలో లేరు... మోదీ దేశాలు పట్టుకుని తిరిగితే, అమిత్‌షా ప్రచారం అని రాష్ట్రాలు పట్టుకుని తిరుగుతున్నారు... దీంతో ఏపీలో జరుగుతున్న విషయాలపై దృష్టిసారించి పరిష్కారమార్గాలు ఆలోచించేవారు ఇక్కడ కనిపించడంలేదు...

dlehi parties 24022018 3

పార్లమెంటు బడ్జెట్‌ తొలి విడత సమావేశాలు వాయిదా పడిన దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్‌ డిమాండ్‌ చేస్తున్న ఏ ఒక్క అంశంపైనా చర్చించిన దాఖలా కనిపించలేదు. హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో శుక్రవారం జరగాల్సిన తెలుగురాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశం కూడా వాయిదాపడటంతో ఉన్న ఆశకూడా కొడిగట్టిపోయింది... ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, మొన్న పార్లమెంట్ లో, ఆర్ధిక లోటు పై, ఆంధ్రప్రదేశ్‌, కేంద్ర ఆర్థికశాఖ అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయని, మరో రెండు మూడు రోజుల్లో, దీని పై, ఒక ఫార్ములా కనుక్కొంటామని చెప్పారు, ఇప్పటికీ ఆతీ గతీ లేదు..

dlehi parties 24022018 2

దిల్లీలో ప్రతి అంశంపైనా మోదీ, అమిత్‌షాలు రాజకీయ నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో ఇటు అధికారులుకానీ, అటు మంత్రులుకానీ దేనిపైనా ముందడుగు వేయలేకపోతున్నారు. మరో పక్క ఇతర జాతీయ పార్టీలదీ అదే దారి... ఇక్కడ కాంగ్రెస్ హడావిడి చేస్తున్నా, ఢిల్లీ లో కాంగ్రెస్ మాత్రం అసలు పట్టించుకోవటం లేదు... మిగతా పార్టీలదీ అదే తీరు... మనం, ఇంత రగిలిపోతుంటే, ఢిల్లీలోని పార్టీలు మాత్రం, మీ చావు మీరు చావండి అన్న చందాన, వదిలేసారు... మార్చి 5న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేంతవరకూ, మళ్ళీ ఎంపీలు ఆందోళన చేసే వరకు, ఢిల్లీలో మన సమస్యలు గుర్తించే వాడే ఉండడు... ఇంత జరుగుతుంటే, రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం, రెండో రాజధాని, రెండో హై కోర్ట్ అంటూ మరో సమస్య మొదలు పెట్టారు... ఢిల్లీలో ఒక పార్టీకి ఇప్పటికే ఆంధ్రోడి దెబ్బ తెలిసింది, మరో పార్టీకి తెలియ చేసే టైం వచ్చింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read