రిలయన్స్ ముకేష్ అంబానీ అమరావతి వచ్చిన నేపధ్యంలో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి... కొన్ని మీడియా సంస్థలతో పాటు, సోషల్ మీడియాలో, అంబానీ మోడీ దూతగా వచ్చారని, కధనాలు రాసారు... మరి కొంత మంది, అంబానీకి దగ్గర ఉండే తెలుగు వాడు, మాధవరావుకు రాజ్యసభ సీటు కోసం, అడగటానికి వచ్చారని రాసాయి... అలాగే, ఇంకో ప్రచారంలో, మోడీని మళ్ళీ ప్రధాని కాకుండా, పొలిటికల్ లాబీలో భాగంగా, చంద్రబాబు ద్వారా ప్లాన్ చేస్తున్నారని, అందుకే అంబానీ, చంద్రబాబుని సియం కంటే పెద్ద హోదాలో ఉండాలనే స్టేట్మెంట్ ఇచ్చారని వార్తలు అల్లాయి... వీటి అన్నటికీ చంద్రబాబు సమాధానం చెప్పారు...
బుధవారం సచివాలయంలో కొందరు మంత్రులతో ఆయన సమావేశమైనప్పుడు ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ప్రధాని మోదీ తరపున దూతగా రిలయన్స్ కంపెనీ అధినేత ముఖేశ్ అంబానీ తన వద్దకు వచ్చారని జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఆయనకు ఆ అవసరం లేదని వ్యాఖ్యానించారు. బుధవారం సచివాలయంలో మంత్రులతో భేటీ అయినప్పుడు.. రాజకీయ వర్గాల్లో ఇలా ప్రచారం జరుగుతోందని ఒక మంత్రి అన్నప్పుడు చంద్రబాబు నవ్వేశారు.
‘కొద్ది రోజుల క్రితం లోకేశ్ ముంబై వెళ్లి ఆయన్ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడంతోపాటు ఒకసారి అమరావతికి రావాలని ఆహ్వానించారు. అమరావతికి ఒట్టి చేతులతో రావడం ఇష్టం లేదని, తిరుపతి వద్ద సెల్‌ఫోన్ల తయారీ పరిశ్రమ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నాకే వచ్చానని ఆయన నాతో చెప్పారు. ఇది గొప్ప విషయం. రాయలసీమలో ఆయన చాలా పెద్ద పరిశ్రమ పెట్టబోతున్నారు. దానివల్ల 10,000-15,000 ఉద్యోగాలు రాబోతున్నాయి’ అని చెప్పారు.మాట్లాడారు.