జగన్ కు దేంట్లో గోల్డ్ మెడల్ వస్తుంది అని ఆలోచిస్తున్నారా ? ఇంకా మనోడికి దేంట్లో వస్తుంది... బాగా ఆరి తేరిన విధ్యలోనే... ఇప్పటికే ఆయనపై 11 సీబీఐ, రెండు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చార్జిషీట్లు ఉన్న జగన్ పై, కొత్తగా ఈడీ చార్జిషీటు మరొకటి తోడయింది... జగన్ కంపెనీల్లో ఇందూ టెక్ జోన్‌పెట్టుబడులకు సంబంధించి దాఖలు చేసిన ఫిర్యాదు (అభియోగ పత్రం)ను గురువారం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇందులో ప్రధాన నిందితులైన వైఎస్ జగన్‌తో పాటు, A2 విజయసాయిరెడ్డితో పాటు మరికొందరికి కోర్టు సమన్లు జారీ చేసింది... వచ్చేనెల 16న నిందితులు, ఆయా సంస్థల ప్రతినిధులు స్వయంగా కోర్టుకు రావాలని ఆదేశించింది...
జగన్ కంపెనీల్లో ఇందూటెక్ పెట్టుబడులపై సీబీఐ సమర్పించిన చార్జిషీట్ ఆధారంగా ఈడీ కూడా విచారణ చేపట్టింది. మనీలాండరింగ్ నిరోధక చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఈ పెట్టుబడులు వచ్చినట్లు నిర్ధారించింది. ఈడీ అభియోగాల ప్రకారం... ‘ఇందూ’ శ్యాంప్రసాద్‌రెడ్డికి చెందిన ఇందూ కన్సార్షియానికి అర్హతలు లేకపోయినా అప్పటి రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా మామిడిపల్లిలో 250 ఎకరాలను కేటాయించింది. ఈ సెజ్ ప్రాజెక్టును అప్పగించేందుకు అప్పటి ఏపీఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ బీపీ ఆచార్య ప్రభుత్వానికి సిఫారసు చేశారు.
అలాగే, 100 ఎకరాలు శ్యాంప్రసాద్‌రెడ్డి కుమారుడు దయాకర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్న ఎస్పీఆర్ ప్రాపర్టీ్‌సకు బదిలీ చేశారు. ఈ భూమిని కేటాయించినందుకు ప్రతిఫలంగా ఇందూ శ్యాంప్రసాద్ రెడ్డి జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో రూ.50 కోట్లు, కార్మెల్ ఏషియాలో రూ.20 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇందులో కొంత మొత్తాన్ని నిమ్మగడ్డకు చెందిన సంస్థల ద్వారా సూట్‌కేస్ కంపెనీల ద్వారా పెట్టుబడులు పెట్టారు. ఇవి మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనలకు విరుద్ధం. ఈ నేపథ్యంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 3,4 నిందితులను శిక్షించాలని ఈడీ తన చార్జిషీటులో కోరింది.