హంద్రీనీవా ద్వారా పుష్కలంగా వస్తున్న కృష్ణా జలాలు అనంతపురం జిల్లా చివరి వరకు, ఆపై చిత్తూరు జిల్లాకు వెళ్లేందుకు.. పుట్టపర్తి వద్ద కొంత భూసేకరణే సమస్య ఉండేది... దీనిని ఎలాగోలా అధిగమించి ఇటీవల అక్కడి కాల్వ తవ్వకం శరవేగంగా మొదలుపెట్టారు. అంతా సవ్యంగా జరుగుతోందని భావిస్తున్న సమయంలో.. సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చింది... దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది... వెరసి కృష్ణా జలాలను పుట్టపర్తిని దాటించేందుకు ప్రత్యామ్నాయాలపై ఇంజినీర్లు దృష్టి సారించారు... ఈ కుట్ర చేస్తుంది, మన ప్రతిపక్ష పార్టీ... పనులు జాప్యం ఒక వైపు చేస్తూ, మరో వైపు అసలు ఏమి తెలియనట్టు, ప్రజల్లోకి వచ్చి, ప్రాజెక్ట్ పుర్తవ్వటం లేదు అని చెప్పటం అలవాటు అయిపొయింది...
హంద్రీనీవా రెండో దశలోని పుట్టపర్తి వద్ద ప్రధానకాల్వ కి.మీ.340 నుంచి 360 కి.మీ. వరకు తొమ్మిదో ప్యాకేజీ ఉంది. ఇందులో కమ్మవారిపల్లె వద్ద 500 మీటర్ల మేర కాల్వ పనులకు భూసేకరణ అవరోధంగా మారింది. వై కా పా కుట్రతో భూ యజమాని పరిహారం కింద ఎక్కువ మొత్తం కోరుతుండటం, నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.23 లక్షలే ఇస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత ఇంజినీర్లు కాల్వ పనులు చేయడాన్ని సవాల్ చేస్తూ భూ యజమాని హైకోర్టును ఆశ్రయించడంతో చాలా కాలంగా ఇక్కడ పనులు నిలిచిపోయాయి. మరోవైపు ఈ కాల్వ అవతల సొరంగం పనులు దాదాపు పూర్తికావడం, అలాగే మారాల, చెర్లోపల్లి జలాశయాలు కూడా సిద్ధమవుతున్నా.. అక్కడికి నీటిని తీసుకెళ్లలేక పోయారు.
ఈ ఏడాది మార్చిలోపు ఎలాగైనా కృష్ణా జలాలను మారాల, చెర్లోపల్లి జలాశయాలకు తీసుకెళ్లడమే కాకుండా, చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి కూడా మళ్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరాకండిగా చెప్పారు. దీంతో అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేసి.. పుట్టపర్తి పరిధిలో భూసేకరణకు సంబంధించి హైకోర్టులో స్టే తొలగిపోయేలా చూశారు. దీంతో గత నెల 4 నుంచి మళ్లీ పుట్టపర్తి వద్ద పెండింగ్ కాల్వ పనులు ఆరంభించారు. శరవేగంగా ఈ పనులు సాగాయి. ఇక కృష్ణా జలాలు ఈప్రాంతాన్ని దాటి ముందుకు పరవళ్లు తొక్కుతాయని అంతా అనుకున్నారు. పెండింగ్ కాల్వ పనుల్లో దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. మరో ఐదారు రోజుల్లో కాల్వ పనులు పూర్తయ్యేవి. అయితే ఇంతలో వైసిపీ అండతో, భూయజమాని సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తీసుకు రావడంతో కాల్వ పనులు ఆగిపోయాయి... దీంతో ఇంత పని చేసినా, కేవలం ఒక్క వ్యక్తి కోసం, ఈ దశలో అక్కడ ప్రాజెక్ట్ ఆగిపోయింది.. అధికారులు, ప్రత్యామ్నాయ అవకాశాల పై దృష్టి పెట్టారు...