ఒక పక్క కేంద్రం పై, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆందోళన బాట పట్టిన వేళ, మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ బహిరంగ విమర్శలు చేస్తున్న వేళ, కేంద్రం నుంచి అనూహ్యమైన వర్తమానం వచ్చింది... ఒక పక్క, ఇక్కడ విభజన హామీల్లో రావాల్సిన నిధులు, రాష్ట్రానికి రావాల్సిన సాయం గురించి మాట్లాడుతుంటే, కేంద్రం పంపించన వర్తమానంతో, రాష్ట్ర అధికారులు అవాక్కయారు...‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీ రాష్ట్రానికి రావాలనుకుంటున్నారు! ప్రధాని స్థాయిలో ప్రారంభించాల్సిన, శంకుస్థాపన చేయాల్సిన పథకాలు, ప్రాజెక్టులు ఏవైనా సిద్ధంగా ఉన్నాయా? ఆ వివరాలు చెప్పండి’’అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి పియంఓ ఆఫీస్ వర్తమానం పంపించింది...

modi 17022018 3

శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు బడ్జెట్‌ సన్నాహక సమావేశంలో ఉండగా ఢిల్లీ నుంచి అందిన సమాచారాన్ని అధికారులు తెలియచేశారు.... అయితే కేవలం ప్రరంభోత్సవాలకే వస్తారా, లేకపోతే ఏమన్నా నిధులు ఇస్తాం అని ప్రకటిస్తారా, లేక అమరావతి వచ్చినప్పుడు ఇచ్చిన నీళ్ళు, మట్టి తీసుకువస్టారా అనేది చూడాల్సి ఉంది... ఒకవేళ ప్రధానమంత్రి వస్తే పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యే లోపు ముందు వస్తారా? తర్వాత వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. అయితే... 5వ తేదీలోపే ప్రధాని వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది...

modi 17022018 2

అమరావతికి ప్రధాని వస్తున్నప్పుడు, ప్రధాని నవ్యాంధ్రకు వరాలు ప్రకటిస్తారని అంతా ఆశించారు. ఆశగా ఎదురు చూశారు. కానీ... ఆయన మొండిచేయి చూపించారు. అప్పుడే దీనిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఇప్పుడు... ప్రజల్లో మరోసారి ఆగ్రహం రగులుతున్న సమయంలో రాష్ట్రానికి వస్తామంటున్నారు... ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఫలితం ఉండదు అనే భావన రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. పైగా... రాష్ట్ర ప్రభుత్వమే కేంద్రంతో కలిసి ఇదంతా చేసిందనే సంకేతాలు వెళతాయి అని ప్రభుత్వం భావిస్తోంది... రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎలా సరిదిద్దుతారు? ఎంత సహాయం చేస్తారు? ఎలా, ఎప్పుడు చేస్తారు? అనే అంశాలపై ముందే స్పష్టత తీసుకోవాలని... ఆ తర్వాతే, ఆయనకు అధికారికంగా ఆహ్వానం పంపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read