ఏపీకి ప్రత్యేక హోదాపై మార్చి 5 నుంచి పార్లమెంట్‌లో ఆందోళనలు చేస్తామని, అప్పటికీ కేంద్రం దిగిరాకపోతే బడ్జెట్ సమావేశాల ఆఖరి రోజైన ఏప్రిల్ 6న తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే.... అప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే రాజనీమాలు చెయ్యవచ్చు కదా, అనీ సామాన్య ప్రజలకు కూడా డౌట్ వస్తుంది.. అలాగే ఇది వరకు కూడా జగన్ ఇలాగే ఛాలెంజ్ చేసి, మరుసటి రోజే ప్రధాని మోడీ దగ్గరకు వెళ్లి ఫోటోలు దిగి వచ్చారు... ఏమైందో ఏమో, అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక హోదా అనే మాట మర్చిపోయారు, రాజీనామలు మర్చిపోయారు... దీని పై జేసీ దివాకర్ రెడ్డి తనదైన స్టైల్ లో స్పందించారు...
'ఏప్రిల్ 6న రాజీనామా చేస్తారట, జగన్ కి ఎంతటి తెలివి తేటలు చూడండి!' అంటూ వ్యంగ్యంగా అన్నారు... 'ఎప్పుడో ఏప్రిల్ 6వ తారీఖు చేస్తారట.. జగన్ బాగా తెలివైనవాడు.. ఏప్రిల్ ఆరున రాజీనామాలు పంపితే వాటి అంగీకారానికి కనీసం రెండు నెలలు పడుతుంది. ఆపై కొన్ని నెలలకే జమిలి ఎన్నికలు వస్తాయి. నవంబర్ లేక డిసెంబరులో ఈ జమిలి ఎన్నికలు వస్తాయి.. ఏపీ లోక్ సభకి మళ్లీ ఎన్నికలు ఎందుకని ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరపదు. నవంబర్ లేక డిసెంబరు వరకు ఆగుతుంది' అని అన్నారు. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలనుకుంటే ఈ రోజే రాజీనామా చేయొచ్చుకదా? అని ప్రశ్నించారు.
2014లో ఎన్నికలు ఏప్రిల్ 7 నుండి మే 12 వరకు జరిగాయి అంటే.. ఇప్పుడు ఏప్రిల్ 6, 2018న వాళ్లు రాజీనామా చేసినా అది ఆమోదం పొంది, ఎన్నికల సంఘంకి వెళ్లి ఎన్నికల షెడ్యూల్ వచ్చే సరికి సమయం సరిపోదు కాబట్టి ఎన్నికలు రావు. కాబట్టి ఎన్నికలు వచ్చే అవకాశమే లేదు. జగన్‌కి కూడ ఉప ఎన్నికల్లో పోరాడాల్సిన అవసరం కూడా లేదు. సో.. జగన్ చేయిస్తానన్న రాజీనామాల వెనుక ఎంతో వ్యూహం ఉంది. జగన్ కూడా పక్కా రాజకీయ నాయకుడిగా లెక్కలు వేస్తున్నాడు..’’ అంటూ వివరంగా లెక్కలతో సహా సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు...