రెండు రోజుల క్రితం అత్యవసర సమావేశం అంటూ, జగన్ పాదయత్ర ఆపేసి మరీ ఒక మీటింగ్ పెట్టుకున్నాడు... తరువాత రోజు, మేము ఏప్రిల్ 6న రాజీనామా చేస్తున్నాం అంటూ గట్టిగా అరిచి ప్రకటించారు... ఇక అప్పటి నుంచి, మా అన్న మగాడు, మా అన్న మగాడు అంటూ, ఒకటే గోల మొదలు పెట్టారు, కిరాయి బ్యాచ్... పోయిన ఏడు కూడా ఇలాగే రాజీనామా చేస్తా అని, దాక్కున్నాడు కదరా, మరి అప్పుడు మగాడు కాదా అంటే ? ఒక్కొక్కడికీ ఫీజులు ఎగిరిపోయాయి... అయితే, ఈ రాజీనామాల విషయం పై, జగన్ కు అత్యంత సన్నిహితుడు క్లారిటీ ఇస్తూ, మీడియాతో అఫ్ ది రికార్డు లో అసలు గుట్టు చెప్పేశారు....

jagan 14022018 2

ఏవండీ, తెలంగాణా ఇస్తున్నారు అంటే, ఇక్కడ ఆంధ్రాలో అందరు ఎంపీలు, అందరు ఎమ్మల్యేలు రాజీనామా చేస్తున్నాం అంటూ, రాజీనామాలు ఇచ్చారు... ఏమైంది ? ఒక్కటన్నా ఆమోదం పొందిందా ? ఇలాంటి రాజీనామాలు స్పీకర్ ఆమోదిస్టారా ? అంటూ అక్కడ ఉన్న విలేకరులతో చిట్ చాట్ లో చెప్పారు... అంతే కాదు, ఒక వేళ రాజీమాలు ఆమోదిస్తే, ఏమిటి అనే చర్చ కూడా, వీళ్ళ మీటింగ్ లో వచ్చింది అంట.. అందుకే జగన్ తో పాటు, లెక్కలు బాగా వేసే విజయసాయి రెడ్డి, లెక్కలతో సహా, ఆంధ్రప్రదేశ్ ప్రజలని ఎలా ఫూల్స్ చేస్తున్నారో చెప్పాడు ఈ పెద్ద మనిషి...

jagan 14022018 3

కరెక్ట్ గా పార్లమెంట్ చివరి రోజు, ఏప్రిల్ 6న రాజీనామా చేస్తాం.. తరువాత వేసవి సెలవులు అని, అవి అని ఇవి అని, 3-4 నెలలు వరకు రాజీనామా ఆమోదం పొందే అవకాసం లేదు... స్పీకర్ కార్యాలయం ఒక్కొక్కరిని పిలిచి, మీరు నిజంగానే చేసారా అనే అడుగుతారు... ఇవన్నీ ఎప్పటికి అయ్యెను... ఒక వేళ ఆమోదం పొందినా, నవంబర్ డిసెంబర్ లో ఎన్నికలు అంటున్నారు...సాధారణ ఎన్నికలకు సంవత్సరం ముందు ఉప ఎన్నికలు జరగవు... ఒక వేళ ఉప ఎన్నికలు ప్రకటించినా, మంగళగిరి ఎమ్మల్యే లాంటి వాడి చేత కోర్ట్ లో పిల్ వేసి, ప్రజాధనం వృధా కాబట్టి, సాధారణ ఎన్నికలతో పాటే జరిపేయండి అని చెప్పిస్తాం... ఇన్ని లెక్కలు ఉన్నాయి మాకు... ఉప ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో, నంద్యాల దెబ్బ మా వాడికి గుర్తుంది... అందుకే ఇన్ని ప్లాన్లు వేసాం.. ఫైనల్ ట్విస్ట్ చెప్పనా అంటూ, ఆయన ఏమి చెప్పారో తెలుసా ? ఇన్ని దాటుకుని ఎన్నికలు జరిగినా, మా విజయసాయి రెడ్డికి ఇబ్బంది ఉండకూడదు అని, రాజీనామలు పార్లమెంట్ సభ్యుల వరుకే పరిమితం చేసాం... ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఇలా ఏప్రిల్ ఫూల్ అవుతున్నారు అంటూ, జగన్ ఆలోచనలు బయటపెట్టారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read