వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కామెడీ టైమింగ్ అదిరిపోయింది... ఒక పక్క రాష్ట్రం మొత్తం, జగన్ మోడీకి భయపడి, ఇంత అన్యాయం జరుగుతున్నా ఏమి అనట్లేదు అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది... ఇది పోగొట్టటానికి జగన్ ఒక కామెడీ ఛాలెంజ్ చేసారు... ఏప్రిల్ 6 లోపు ప్రత్యెక హోదా ఇవ్వకపోతే, మా ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారని జగన్ ప్రకటించారు... ఇక్కడ కామెడీ ఏంటి అంటే, విజయసాయి రెడ్డి మాత్రం రాజీనామా చెయ్యరు... పార్లమెంట్ సభ్యులు మాత్రమే రాజీనామా చేస్తారు... అయితే, రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయి రెడ్డికి మినహయింపు ఎందుకో అందరికీ తెలిసిందే...
అయితే, పార్లమెంట్ సభ్యులలో కూడా ఎంత మంది రాజీనామాకు రెడీ అవుతారో చూడాల్సి ఉంది... ఇప్పటికే మేకపాటి టిడిపితో టచ్ లో ఉన్నారు, ఇక మిగిలిన నలుగురిలో ఇద్దరు జగన్ బంధువులే, ఒకాయిన వ్యాపార భాగస్వామి, ఇంకో ఆయిన ఏంటో ఆయనికే తెలియదు... మొత్తానికి, ఇప్పుడు జగన్ వీరి చేత రాజీనామా చేయిస్తారా, లేక పోయిన ఏడాది చెప్పినట్టు, ఇది కూడా కామెడీ ఛాలెంజ్ మాత్రమేనా అనేది చూడాల్సి ఉంది... జగన్ రాజీనామా అంటే, ప్రజలకు అదే అభిప్రాయం ఉంది... పోయిన ఏడాది కూడా ఇలాగే అన్నారు, టైం కూడా ఇచ్చారు, రాజీనామాలు చెయ్యవయ్యా అంటే, తుర్రు మన్నాడు.. ఇప్పుడు మోడీతో కుమ్మక్కు అయిపోయావ్ అనే విమర్శలు వస్తున్న వేళ, మరో డ్రామా మొదలు పెట్టాడు జగన్...
అయితే, అసలు ఈ రాజీనామాలతో జగన్ సాధించేది ఏంటి అంటే ? ఏమి లేదు... జగన్ ఎంపీలు రాజీనామా చేస్తే, అక్కడ మోడీకి పోయేది ఏమి ఉండదు.. నిజానికి పార్లమెంట్ వేదికగా మాత్రమే, కేంద్రాన్ని దేశం మొత్తం ముందు దోషిగా నిలబెట్టచ్చు.. జగన్ ఎంపీలు, ఎలాగూ పార్లమెంట్ లో మోడీని చూస్తే, పారిపోతారు కాబట్టి, లోపల ఉన్నా, లేకపోయినా ఒకటే అనుకున్నారో ఏమో... మరొకటి ఏంటి అంటే, డిసెంబర్ లో ఎలక్షన్స్ వస్తాయి అంటున్న టైంలో, కేవలం ఆరు నెలల ముందు రాజీనామా చేస్తే, ఎవరికి లాభమో జగన్ కి మాత్రమే తెలియాలి... అయినా, వీళ్ళు చేసినప్పుడు సంగతి కదా... అయినా ఇక్కడ మరో విషయం... జగన రాజీనామాలు చేసేది ప్రత్యేక హోదా కోసం అంట.. పోలవరం కోసం కాదు, ఆర్ధిక లోటు భర్తీ కాదు, EAP నిధుల కోసం కాదు, రైల్వ జోన్ కోసం కాదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం కాదు, దుగ్గిరజపట్నం పోర్ట్ కోసం కాదు, వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే నిధుల కోసం కాదు, వివిధ విద్య సంస్థల నిధులు కోసం కాదు, ఉమ్మడి ఆస్తుల విభజన కోసం కాదు, 9,10 షడ్యుల్ సంస్థల కోసం కాదు... ఇది ఆయనగారి తెలివి.. చివరగా, జగన్ గారు.. ఏప్రిల్ 6 శుక్రవారం... కోర్ట్ కి పోవాలి గుర్తుపెట్టుకోండి...