తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు... శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనాచౌదరి తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే... తరువాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా, అశోక్‌గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ పై చేసిన కామెంట్, శభాష్ అనిపించేలా ఉన్నాయి... ‘‘ఆనాడు అసెంబ్లీ వ్యతిరేకించినా జాతీయపార్టీలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను విభజించాయి. ఆరోజు భాజపా మద్దతు ఇవ్వకపోతే విభజన జరిగి ఉండేది కాదు. అందువల్ల న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపైనా ఉంది. ఇప్పుడు మళ్లీ మేం గడియారాన్ని వెనక్కు తిప్పమని అడగడం లేదు. ఇచ్చిన హామీలను గౌరవించండి." అని అన్నారు....
"మేం భారతీయులం... సోమరిపోతులంకాదు. కష్టపడి దేశానికి మా వంతు చేయూతనందిస్తాం. ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ప్రభుత్వ స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేసి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కష్టం ధారపోస్తున్నారు. ఇందుకు కేంద్రం చేయూత తోడైతే రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. మా గురజాడ అన్నట్లు... దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని గుర్తుంచుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి. దాన్ని ఎలా చేయగులుగుతారో చెప్పాలి...’’ అంటూ ఆంధ్రా వాడి సత్తా ఏంటో చాటి చెప్పారు...
మరో పక్క సుజనా మాట్లాడుతూ, ‘‘ఆ రోజు పూర్తి అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజన బిల్లును పాస్ చేసిన విధానం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియగా జరగలేదు. పార్లమెంటు ఉభయసభల్లో నాడు విభజన బిల్లు ఎలా పాసైందో అందరికీ తెలుసు. అయినా ఆ గాయాలను మరిచి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఎన్డీయేతో కలిశాం. ప్రత్యేకహోదా అంశాన్ని సరైన సమయంలో పరిష్కరించలేదు. ఇది వరకు చెప్పిన ప్రత్యేకప్యాకేజీనైనా ప్రకటించిన వెంటనే అమలు చేసి ఉంటే బాగుండేది. కనీసం అది కూడా చేయలేదు. ఒక జాతీయపార్టీ దగా చేస్తే... మరో జాతీయ పార్టీ మోసం చేసింది. దానివల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. " అంటూ కుండ బద్దలు కొట్టారు...