టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనతో ప్రధాని ఫోన్ సంభాషణను ఎంపీలకు సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో పార్టీల అభిప్రాయాలను చంద్రబాబు, ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. మిగతా జాతీయ పార్టీలు కూడా మన కోసం కలిసి వచ్చి పోరాడేలా, మనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని చెప్పారు.. ఇదే సందర్భంలో నిన్న జగన్ చేసిన సూచన పై చంద్రబాబు స్పందించారు... మంత్రుల రాజీనామాతో ఏమీ కాదు, మంత్రులు రాజీనామా చెయ్యాలి, అవిస్వాసం పెట్టాలి, నన్ను ఫాలో అవ్వండి అంటూ, నిన్న జగన్ చేసిన సూచన పై చంద్రబాబు ఒకింత విస్మయం వ్యక్తం చేసారు...
జగన్ లాంటి వాడి దగ్గర నుంచి, జాతీయ జకీయాలు గురించి నేను నేర్చుకోవాలా ? జాతీయ రాజకీయాలను జగన్ దగ్గర తానిప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఆక్రమాస్తులు, క్విడ్ ప్రోకోలకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.. మేము తీసుకున్న నిర్ణయం, తీసుకోబోయే నిర్ణయాలు జగన్ లాగా సొంత ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనల కోసమని స్పష్టం చేసారు...
టీడీపీ తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో పలు పార్టీల అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నానని, ఎన్నో పార్టీలు మద్దతు పలికాయని వెల్లడించారు. పలు పార్టీలు టీడీపీకి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మనమేమీ గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, చట్టంలో ఉన్నవే అడుగుతున్నామని స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాటు ఎదురుచూసినా ఫలితం రానందునే రాజీనామాలు చేశామని తెలిపారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా ప్రయోజనాల కోసమే కేంద్రం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు తమ నిరసనలను కొనసాగించాలని ఆదేశించారు.