అటు నిన్న చంద్రబాబు మా మంత్రులు కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పగానే, ఇటు వైకాపా అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండిటికీ లింక్ అయితే ఉందో లేదో తెలియదు కాని, జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే, జగన్ తన కేసుల ఉపసమనం కోసం, బీజేపీలో తన పార్టీని కలిపేస్తాడు అనే వార్తలు వచ్చాయి... ఇటు తెలుగుదేశం బయటకు రాగానే, వైసిపీ బీజేపీ క్యాబినెట్ లో చేరిపోతుంది అని, త్వరలో A2 విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అవుతున్నాడు అనే ప్రచారం వైసిపీ క్యాంపు చేస్తుంది... అయితే, ఈ నేపధ్యంలో జగన్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుని..
జగతి పబ్లికేషన్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడుల వ్యవహారంలో 34.64 కోట్ల రూపాయలను ఈడీ తాత్కాలిక జప్తు చేయడాన్ని అప్పీలేట్ ట్రైబ్యునల్ తప్పు పట్టింది. ఈడీ ఉత్తర్వులను కొట్టివేసింది. మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరిస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో ఈడీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.
జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన రూ. 34.64 కోట్లను తాత్కాలిక జప్తు చేస్తూ 2013లో ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టివేసింది. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్ కణ్ణన్, ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్ అనే ముగ్గురు వ్యాపారులు 34.64 కోట్లు పెట్టబడులు పెట్టారు... మరి ఈ కేసుల్లో ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో... చూద్దాం.. ఇవన్నీ ఎప్పటి నుంచి అనుకున్నావేగా.. స్క్రిప్ట్ ఇప్పుడు ఇంప్లెమెంట్ చేస్తున్నారు అనుకోవాలేమో...