వైసిపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, మన ఖర్మకి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కూడా... ఖర్మ అనే పదం ఎందుకు వాడాల్సివచ్చిందో అర్ధమై ఉంటుంది... ఈయన ప్రతిపక్ష నాయకుడుగా చేసింది శూన్యం... ఇప్పుడు చేసే పాదయాత్ర కూడా, ఒక్క సమస్య పరిష్కారం దిశగా తీసుకువెళ్ల లేదు... ఏమి అడిగినా, ఆఫ్టర్ సియం అంటాడు... మన దౌర్భాగ్యం ఎలా ఉంది అంటే, చివరకు అసెంబ్లీ సమావేశాలు కూడా బహిష్కరించాడు.. ఈయన ఒక్కడే అనుకుంటే, కాదు, పార్టీ సభ్యులు ఎవరూ వెళ్ళటానికి వీలు లేదు అని తేల్చి చెప్పారు... శీతాకాల అసెంబ్లీ సమావేశాలను బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు కూడా బ‌హిష్క‌రించే యోచనలో ఉన్నారు...

jagan fire 26022018 2

ఈ విషయం జగనే స్వయంగా చెప్పారు... జగన్ కు అసెంబ్లీకు వెళ్ళే ఉద్దేశం లేదట. కనిగిరిలో మాట్లాడుతూ అసెంబ్లీకి వెళ్లాలంటే మ‌న‌సు రావ‌డం లేద‌ని అన్నారు. చ‌ట్ట‌స‌భ‌లు చేసిన చ‌ట్టాలు ఈ పాల‌న‌లో అమ‌లు కావ‌డం లేద‌ని ఆరోపించారు. అందుకే అసెంబ్లీకి వెళ్ళటం లేదు అని చెప్పారు.. అంటే, దీని బట్టి, జగన్ పార్టీ ఈ సారి బడ్జెట్ సమావేశాలు కూడా వెళ్ళదు అని అర్ధమైపోయింది... మార్చి 5 నుంచి ఏపీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. 5న ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉంటుంది, 8న రాష్ట్ర ఆర్థిక‌మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెడ‌తారు. రాష్ట్రానికి, ఎంతో ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు కూడా, జగన్ ఎగ్గొడుతున్నాడు... ఈ సారి అసెంబ్లీకి వెళ్దాం అని కొంత మంది ఎమ్మల్యేలు జగన్ ని వేడుకుంటే, నా మాటే నా మాటే శాసనంఅంటూ, తేల్చి చెప్పారు జగన్... జగన్ లో ఫైర్ చూసి ఆ ఎమ్మల్యేలు అవాక్కయి అక్కడ నుంచి వెళ్ళిపోయారు...

jagan fire 26022018 3

నిజానికి జగన్ బహిష్కరించటానికి చాలా కారణాలు ఉన్నాయి... ముందుగా, పాదయత్రకు బ్రేక్ ఇచ్చి, అసెంబ్లీలో కూర్చుంటే, పెద్ద ఉపయాగం ఉండదు అనే భావన... రెండోది, తాను ఒక్కడే వెళ్ళకుండా, పార్టీని సభలో లీడ్ చేసే అవకాశం వేరేవారికి ఇవ్వడానికి ఇష్టం లేక.. చివరగా మూడోది, తాను ముఖ్యమంత్రి అయితేనే, అసెంబ్లీలో అడుగు పెడతానని జగన్ చెప్తున్నారు అంట... అలాగే, జగన్ కు అమరావతి రావటం ఇష్టం లేదు అనే వాదన కూడా ఉంది... ఇవన్నీ పక్కన పెడితే, ఎన్ని రాజకీయాలు ఉన్నా, ముందుగా ప్రతిపక్ష నేతగా, ప్రజల తరుపున అసెంబ్లీలో మాట్లాడాల్సిన బాధ్యత తన మీద ఉంది అనే విషయం జగన్ మర్చిపోయారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read