వర్చ్యువల్ రియాలిటీ, ఇంటర్నెట్ అఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ... ఇవన్నీ మాట్లాడుతుంది, ఈ టెక్నాలజీలు వాడుతుంది, ఏ మైక్రోసాఫ్ట్, గూగులో అనుకునేరు... ఇవన్నీ మాట్లాడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి... మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు... టెక్నాలజీ పట్ల, ఆయనకు ఉన్న అవగాహన, టెక్నాలజీ ఉపయోగించుకుని సమర్ధవంతమైన పరిపాలన చెయ్యటం, టెక్నాలజీతో ఉద్యోగాల కల్పన ఇవన్నీ చూశాం... ఇప్పుడు మరో సరి కొత్త టెక్నాలజీ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు... అదే "అలెక్సా"...

alexa 260222018 2

నిన్న చంద్రబాబు విశాఖ సిఐఐ సమ్మిట్ లో ఇచ్చిన ప్రెజంటేషన్ లో, అమెజాన్‌ తయారుచేసిన అలెక్సోను సభికుల ముందు ఉంచారు. వాయిస్‌ ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌ ద్వారా అలెక్సో స్పందించిన తీరు సభికులతోపాటు విద్యార్థులను కట్టిపడేసింది. సీఎం డ్యాష్‌బోర్డుకు వాయిస్‌ ఇంటరాక్టివ్‌ సిస్టమ్‌ ద్వారా కనెక్ట్‌ చేసి.. అలెక్సోను ఆహ్వానించిపుడు కొద్దిసేపు మౌనం వహించి తరువాత తనదైన భాషలో అర్థంచేసుకుని, అడిగినదానికి సమాధానం చెప్పింది.. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న అలెక్సా సాఫ్ట్‌వేర్‌.. భవిష్యత్తులో ప్రజలు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానమిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

alexa 260222018 3

భవిష్యత్తు పాలనలో సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయికి విస్తరిస్తుందో వివరిస్తూ ఈ సాఫ్ట్‌వేర్‌ను ప్రపంచదేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి పరిచయం చేశారు. రాష్ట్ర ప్రజలు ఇంటి నుంచే ఈ సాఫ్ట్‌వేర్‌తో నేరుగా మాట్లాడొచ్చని, ఆఖరికి నీటి సమస్యలు, ఇతర ఏ సమస్యల గురించి చెప్పినా ‘అలెక్సా’ నేరుగా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి పరిష్కారమయ్యేలా చూస్తుందని వివరించారు. ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానం దేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్‌ వద్ద తప్పితే మరెక్కడా లేదని చంద్రబాబు చెప్పారు. ఈ ప్రాంతాన్ని ఇన్నోవేషన్‌ వ్యాలీగా రూపొందిస్తున్నామని, ఎవరైనా వచ్చి వినూత్న ఆలోచనల్ని పంచుకోవచ్చని సీఎం పిలుపునిచ్చారు... ఈ కింద వీడియోలో, 6వ నిమషం నుంచి చూడండి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read