చంద్రబాబుకి ఇంగ్లీష్ మాట్లాడం రాదు, నేను ఫస్ట్ క్లాసు లో పాస్ అయ్యాను అంటాడు ఒక మహానుభావుడు... ఇంకొకడు, నీ మొఖం చూసి ఎవడూ పెట్టుబడులు పెట్టరు అంటాడు... వీళ్ళు వెనక్కి తరిగి చూసుకుంటే, 33 స్కాములు, 66 చార్జ్ షీట్లు.. కాని ఏమి చేస్తాం ప్రజాస్వామ్య దేశం కదా, అందరినీ భరించాలి... మన ముఖ్యమంత్రి వీళ్ళ లాగా కాదు... వీల్లందరికీ ఆయన పనితనం తోనే సమాధానం చెప్తారు... నిన్న మరో సారి, తాను ఏంటో దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో మంది మేధావుల మధ్య నిరూపించుకున్నారు. ఇంగ్లీష్ అనేది ఒక బెంచ్-మార్క్ కాదు, నాలెడ్జి మేటర్స్ , అడ్మినిస్ట్రేటివ్ స్కిల్ల్స్ మేటర్స్, ఎక్స్పీరియన్స్ మేటర్స్ అనేది మరో సారి నిరూపించారు చంద్రబాబు...
టెక్నాలజీ వినియోగంలో ఏపీ నంబర్‌వన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆధునిక టెక్నాలజీని వినియోగించడమే కాదు.. దానిని విజయవంతంగా అమలుచేసి ఫలితాలు సాధిస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సమగ్ర ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఈ- ఆఫీస్, ఈ-కేబినెట్, బయోమెట్రిక్, ఈ-క్లౌడ్ మేనేజ్‌మెంట్ విధానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. రాష్ట్రంలో వచ్చే మార్చి నెలాఖరులోగా కాగిత రహిత పాలన వచ్చేస్తుందని చెప్పారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఫైలింగ్, ఈ-ఆఫీస్, బయోమెట్రిక్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. సీఐఐ పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు (సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్) రెండోరోజు.. ‘రేపటి కోసం సాంకేతిక పరిజ్ఞానం (టెక్నాలజీ ఫర్ టుమారో)’ అంశంపై ఆయన కీలక ప్రసంగం చేశారు.
ప్రసంగం చివరకి వచ్చేసరికి, క్రికెట్ లో, సచిన్ ఫార్మ్ లో ఉంటే ఎలా రేచ్చిపోతాడో, అలా ఆయనలో ఉన్న మార్కెటింగ్ గురు బయటకి వచ్చాడు... అక్కడ ఉన్న పెట్టుబడిదారులను ఉద్దేశిస్తూ... మీరు మా అమరావతి రండి, మా రాష్ట్రం రండి.. జరుగుతున్నది చూడండి... పెట్టుబడులు పెట్టండి... మీకు ఏమి కావాలో అన్నీ ఇస్తాను... 24/7 పవర్, వాటర్... పవర్ సెక్టార్ లో మమ్ముల్ని కొట్టినోడు లేడు... ప్రతి ఇంటింకి ఫైబర్ గ్రిడ్ తో ఇంటర్నెట్ ఇస్తున్నాం... ప్రతి ఇంటిని ఒక నాలెడ్జి ప్లేస్ గా తీర్చిదిద్దుతున్నాం... మాకు సంక్షేమం, అభివృద్ది రెండు కళ్ళు... వ్యవసాయం,పారిశ్రామికం రెండు బాలన్స్ చేస్తున్నాం... ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మేము టాప్... ఇవన్నీ నేను చెప్పటం కాదు, మా గ్రోత్ రేట్ చూడండి... డబల్ డిజిట్ గ్రోత్ రేట్ ఉన్న ఏకైక రాష్ట్రం మాది.... వచ్చే సంవత్సరం కూడా మేము డబల్ డిజిట్ గ్రోత్ సాధిస్తాం... మేము పోటీ పడేది ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఎక్కడ ఉన్నా వాటితో... అమరావతి ని వరల్డ్ టాప్ 10 సిటీస్ లో ఉంచటమే నా ధ్యేయం... నేను తప్పకుండా అది సాధించి తీరుతా అంటూ, తాను సియంని అనే విషయం మర్చిపోయి, తన రాష్ట్రం గురించి ఒక మార్కెటింగ్ అజేంట్ లా పెట్టుబడి దారులకి, వివరించారు..
ఇంత సుదీర్ఘంగా చంద్రబాబు చేసిన ప్రసంగం అక్కడ ఉన్న వారిని ఆకట్టుకుంది... చంద్రబాబుకు తన రాష్ట్రాన్ని అభివృధి చెయ్యటానికి ఎంత తాపత్రయపడుతున్నారో అక్కడ ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్తలు గుర్తించారు. తన ప్రసంగం ముగియగానే, ఆడిటోరియం మొత్తం చప్పట్లతో నిండిపోయింది... ఒక నాయకుడి నాయకత్వ లక్షణాలు బయట పడేది ఇలాంటి సందర్భాల్లోనే కదా.... ఇలాంటి ముఖ్యమంత్రి మనకి ఉండటం ఎంతో గర్వకారణం అని టీవీల ముందు కూర్చున్న ప్రజలు, ప్రశంసించారు....