తిరుపతి నుంచి అమరావతి దాకా, అలుపెరుగని ప్రయాణం ఆయన రాజకీయం... ఆటుపోట్లకు వెరవని మొండిఘటం... వ్యూహ చతురతలో ఎదురులేని చాణక్యం.. పాలనాదక్షుడిగా అపార అనుభవం.. 40 ఏళ్ల రాజకీయ అనుభవం !! 23 ఏళ్లకే MLC పదవికి నామినేషన్ !! 26 ఏళ్లకే MLA !!! 28 ఏళ్లకే క్యాబినెట్ మంత్రి !! 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి !! 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు !! తెలుగు రాజకీయాల్లో చంద్రబాబు ఒక చరిత్ర !! ఆయన వయసు 66 ఏళ్లు! అందులో అచ్చంగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం! 1978 ఫిబ్రవరి 27న చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యేగా చంద్రబాబు గెలుపును నిర్ధారిస్తూ అధికారిక ఫలితం వెలువడింది. మరి ఆయనకు మొదటి సారిగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, చంద్రబాబుకి మొదటి సారి బీఫారం ఇచ్చింది ఎవరో తెలుసా ? ఇప్పుడాయిన ఏమంటున్నారో చూడండి...
చంద్రబాబు రాజకీయ జీవితం నా చేతుల మీ దుగానే మొదలవటం తలచుకుంటే ఇప్పుడు చాలా గర్వంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో తొలి బీఫారం ఇచ్చి చంద్రగిరి నుంచి పోటీచేసే అవకాశం కల్పించాం. మొదటి నుంచి కష్టపడే తత్వం చంద్రబాబుది. అందుకే అపజయం చాలా తక్కువ సందర్బాల్లో తప్ప ఆయన దగ్గరకు కూడా రాలేదు'... టీడీపీ సీనియర్ నేత, రాజకీయ కురువృద్ధుడు యడ్లపాటి వెంకట్రావు చెప్పిన మాటలివి. 40 ఏళ్ల రాజకీయ జీవిత విశేషాలను యడ్లపాటి చెప్పారు. రెడ్డి కాంగ్రెస్, ఇందిర కాంగ్రెస్ గా విడిపోయిన రోజుల్లో మర్రి చెన్నారెడ్డి ఇందిర కాంగ్రెస్ తరపున ఆంధ్రప్రదేశ్‌లో గెలిచే అభ్యర్థులను ఎంపిక చేసి, బీఫారాలు ఇచ్చే బాధ్యతను నాపైన, బాపట్లకు చెందిన న్యాయవాది పసుపులేటి కోటేశ్వరరావు పైన పెట్టారు.
ఆ సమయంలో చిత్తూరు నుంచి రాజగోపాలనాయుడు గారు, చంద్రబాబును తీసుకువచ్చి, ఈయనకు బీఫాం ఇవ్వాలని, విద్యార్థి సంఘాల్లో లీడర్‌గా మంచి పాత్ర పోషించారని, తప్పనిసరిగా గెలుస్తా రని సిఫార్సు చేశారు. అప్పుడే చంద్రబాబుకు చంద్రగిరి నియోజకవర్గం ఖాయం చేశాం. మాట నిలబెట్టుకుని గెలిచి చూపారు. అప్పుడే నాకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత చంద్రబాబు ప్రోత్సాహం, ఎన్టీఆర్ ఒత్తిడితో టీడీపీలో చేరా. జెడ్పీ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది చంద్రబాబే. ఆయన అప్పుడు, ఇప్పుడు నాకిచ్చే గౌరవం మరువలేనిది. అయితే అప్పటి రాజకీయాలకు, నేటి రాజకీయాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో పార్టీ సిద్ధాంతాలకు ప్రాధాన్యం ఉండేది. అసెంబ్లీలోనూ వ్యక్తిగతం అసలు ప్రస్తావనకే వచ్చేదికాదు. చిన్నవారు ఎమ్మెల్యేలుగా ఉన్నా ఆవేశాలు - లేకుండా హుందాగా ఉండే వాదనలతో పెద్దల సభను తలపించేలా నడచుకునేవారు. ఇంత వయసులోనూ చంద్రబాబు ప్రజల కోసం పరితపించటం ఆయన కష్టపడే తత్వానికి నిదర్శనం. పార్టీ ఏదైనా ఆ నేతలోని మంచి లక్షణాలను అవలంబించాలనుకోవటంలో తప్పులేదు. ఇకపైనైనా రాజకీయం తీరు మారుతుందని ఆశిస్తున్నా.