జగన్ పార్టీ ఎమ్మల్యేలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ఎప్పుడూ చులకనే... వీరి రాజకీయం ప్రయోజనాల ముందు, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బ తిన్నా వీరికి ఇబ్బంది ఉండదు... ఉభయసభల్లో ఏనాడు వీరు రాష్ట్రానికి మంచి చేసే ప్రశ్నలు వెయ్యలేదు... కేంద్ర విధానాన్ని ప్రశ్నిస్తూ ప్రశ్నలు వెయ్యలేదు... ఎప్పుడు, వీరి టార్గెట్ చంద్రబాబే... పోలవరం పై లిటిగేషన్ ప్రశ్నలు అయితే కోకొల్లలు... రాష్ట్రానికి మంచి చేసే ప్రశ్నలు వెయ్యకుండా, ఇబ్బంది పెట్టే ప్రశ్నలు మాత్రమే వేస్తారు... దాంట్లో రాజకీయం ప్రయోజనం పొందటానికి చూస్తారు.. చివరకు అది రివర్స్ అయ్యి సెల్ఫ్ గోల్ అవుతుంది...

question 06032018 2

తాజాగా, నిన్న వైఎస్ఆర్ కాంగ్రస్ పార్టీ ఎంపీ, జగన్ కు వ్యాపార భాగస్వామీ, బంధువు అయిన వైవీ సుబ్బారెడ్డి పార్లమెంట్ లో ఇలాంటి ప్రశ్నే వేసి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడదాం అనుకుని, వారే ఇబ్బంది పడ్డారు... ఈ 4 ఏళ్ళలోఏపీలో ఎన్ని ఒప్పందాలు జరిగాయి, వాటివల్ల ఎంత పెట్టుబడి రాబోతుంది, ఉపాధి, ప్రస్తుతం పనిచేసేందుకు సిద్ధమైన కెంపెనీలు ఎన్ని, వైసిపీ ఎంపీ ప్రశ్న అడిగితే, దానికి కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి సీఆర్‌ చౌదరి సమాధానం ఇచ్చారు... నాలుగేళ్లల్లో మొత్తం 2680 ఎంవోయూలు కుదిరాయని, రూ.17,80,891 కోట్లు మేర పెట్టుబడులు రానున్నాయని, తద్వారా 41,99,357 మందికి ఉపాధి లభించనుందని వివరించారు.

question 06032018 3

ప్రతి సంవత్సరం ఎన్ని పెట్టుబడులు, ఎన్ని ఉద్యోగాలు అనేవి వివరంగా చెప్పారు... చివరగా, ఈ ఒప్పందాల నుంచి, ఈ నాలుగు ఏళ్ళలో, 531 కంపెనీలు మొదలు పెట్టారని, వాటి విలువ 1,29,661 కోట్లు అని, పరిశ్రమల రాకతో ఏపీలో ఇప్పటి వరకు 2,64,754 మందికి ఉపాధి లభించిందని లిఖిత పూర్వకంగా వెల్లడించారు... దీంతో ఇప్పటి వరకు, చంద్రబాబు ఎంత చెప్పినా నమ్మని వారు, కేంద్రం ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంతో, నమ్మేలా చేసింది వైసిపీ.... ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వారు కూడా ప్రచారం చేసుకోలేని దానిని, వైసిపీ దేశం మొత్తం వినపడేలా చేసి, మన రాష్ట్ర సత్తా, మన ముఖ్యమంత్రి సత్తా ఈ దేశానికి చాటింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read