కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన హామీల అమలుపై స్పష్టత రావాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎంపీలకు స్పష్టం చేశారు. పార్టీ ఎంపీలు, తెలుగుదేశం సమన్వయకమిటీ సభ్యులతో ఈరోజు ఉదయం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రం నుంచి అన్ని అంశాల్లో స్పష్టత వచ్చేంత వరకు పోరాటం ఆపొద్దని ఎంపీలకు స్పష్టం చేశారు. జైట్లీతో గత రాత్రి సమావేశ వివరాలను ఎంపీ తోటనరసింహ ముఖ్యమంత్రికి వివరించారు. సమావేశానికి అమిత్‌షా హాజరుకాకపోవడంతో రెండు అంశాలపై మాత్రమే చర్చ జరిగిందని.. మిగిలినవి వాయిదా వేశారని ఎంపీలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.
దీని పై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు.. హామీల అమలుపై చర్చించేందుకు న్యూఢిల్లీకి రావాలని స్వయంగా కోరిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, గత రాత్రి అరుణ్ జైట్లీతో సమావేశానికి ఎందుకు రాలేదని చంద్రబాబు ప్రశ్నించారు... కేవలం రెండు అంశాలు చర్చించటానికి, ఇంత హడావిడి చేసారని, అవి కూడా స్పష్టత లేకుండా చేస్తాం, చూస్తాం అన్నారని, చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు... వీరు ఇలాంటివి చేస్తారు కాబట్టే, మీరు రాకపోవటం మంచిదైందని ఒక ఎంపీ అన్నారు..
రాష్ట్ర ఎంపీలకు దిశానిర్దేశం చేసిన చంద్రబాబు, పార్లమెంటులో హోదా కోసం నిరసనలు తెలియజేస్తూనే ఉండాలని సూచించారు.. అన్నీ సాధించే వరకూ టీడీపీ వైఖరిలో మార్పు ఉండదని, ఈ విషయం కేంద్రానికి తెలిసేలా చేయాలని కోరారు. .. దేశవ్యాప్తంగా ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలకు చంద్రబాబు పేరుతో ఉన్న లేఖలు అందజేయాలని, అవసరమైతే పార్టీల నేతలతో నేరుగా మాట్లాడాలని చంద్రబాబు నిర్ణయించారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందన్న భావన ఎంపీల్లో ఉందన్నారు. అరుణ్ జైట్లీతో సమావేశంలో ఈఏపీలు మినహా పారిశ్రామిక రాయితీల గురించి మాట్లాడలేదన్న టెలికాన్ఫరెన్స్ ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు.