ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహార శైలి గురించి చెప్పాల్సిన పని లేదు.. ప‌రిపాల‌న‌కు సంబంధించి, రాజ‌కీయం చేయ‌డానికి సంబంధించి ఆయ‌న మీద వ్య‌తిరేక‌త‌లు, స‌మ‌ర్థ‌న‌లూ ఉన్నా కానీ, సుదీర్ఘ రాజ‌కీయ జీవితం వున్న లీడ‌ర్‌గా ఆయ‌న‌కివ్వాల్సిన గౌర‌వాన్ని ఖ‌చ్చితంగా ఇచ్చితీరాలి.. 40 ఏళ్ళ రాజకీయ జీవితానికి సంబంధించి, అన్ని కొన్ని టీవీ చానల్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు... నిన్న ఒక మెరుగైన సమాజం కోసం పాటు పడే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో, ఎప్పుడూ చూడని చంద్రబాబు కనిపించారు.. చంద్రబాబు బ‌హుశా ఇదే మొదటి సారి ఏమో, మీడియా సంయ‌మ‌నం లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్న ధోర‌ణిని త‌ప్పుబ‌ట్టారు... ఇది మూడు అఫ్ ది స్టేట్ కూడా...

cbn news 01032018 2

గత కొన్ని రోజులుగా కొన్ని తెలుగు న్యూస్ చానల్స్ మరీ ఘోరంగా తయారు అయ్యాయి... హైదరాబాద్ లో కూర్చుని, ఆంధ్రప్రదేశ్ మీద చూపించే వివిక్ష ఒక ఎత్తు అయితే, ఎలాంటి వార్తలకి, కత్తులకి, సుత్తులకి ఇస్తున్న ప్రాముఖ్యం మరో ఎత్తు... ఇలా రెచ్చిపోతున్న మీడియాకి, ఎవరు గెట్టిగా ఇస్తారా అనుకున్న టైంలో, నిన్న చంద్రబాబు గట్టిగా వాయించారు... మారుతున్న కాలంలో మీడియా సంస్థ‌లు త‌మ‌కంటూ సొంత ఎజెండాలు పెట్టుకుని ప‌నిచేయ‌డం చూస్తున్నాం. ఈ తీరును ఎండ‌గ‌ట్ట‌డానికి చంద్ర‌బాబు ఈరోజు కొంత ఇనిషియేటివ్ తీసుకున్నారు...

cbn news 01032018 3

నిన్న ఇంటర్వ్యూ లో మెరుగైన సమాజం కోసం పాటు పడే ఛానల్, అడిగిన కొన్ని ప్ర‌శ్న‌ల హేతుబ‌ద్ధ‌త గురించి కాసింత ఆగ్ర‌హంగానే స‌మాధాన‌మిచ్చారాయ‌న‌. "స్ట‌డీ చేయ‌కుండా నేనేదీ మాట్లాడను. నువ్వూ అదే అల‌వాటు చేసుకోవాలి; నువ్వు మార‌వ్‌, నీ ఆలోచ‌న తీరు మార‌దు, నీ మ‌న‌సులో నెగ‌టివిటీ పెరిగిపోయింది, అది పాజిటివ్‌గా మారాలి, బుర‌ద లోంచి బ‌య‌టికి రావాలి నువ్వు" అంటూ చంద్ర‌బాబు కొంచెం ఘాటుగా స్పందించారు... ఎప్పుడూ మీడియాతో మంచిగా ఉండే చంద్రబాబు, మొదటి సారి, ఇలా మేడియాను వాయించటం వెనుక తప్పు లేదు... ఈ ఛానల్స పై ప్రజలందరూ అనుకునేది కూడా ఇదే...

Advertisements

Advertisements

Latest Articles

Most Read