రాష్ట్ర బీజేపీ నేతల చేస్తున్న పనులకి, ఆవేదనతో ఒక ఆంధ్రుడి రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది... ఆ లేఖ సారంశం ఇదే... "బాష సంస్కారంను గౌరవించి అంతకంటే పెద్ద పదాలు వాడలేకపోతున్నాను. ఎవరిగురించి అనుకుంటునారా... అదే మన బీజేపీ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ యోధుల గురించి. ఈ నేల మీదే పుట్టారు.. ఇక్కడే పెరిగారు... ఇక్కడ వనరులే వాడుకున్నారు/వాడుకుంటూనారు ... వీరి కుటుంబాలు, వీరి బంధుగణం అంతా ఇక్కడే ఉంది. అయినా, ఈ తెలుగు నెల పట్ల కాని, బాష పట్ల గాని ఇక్కడ ప్రజల పట్ల కాని ఎక్కడ వీసేమేత్తు కృతజ్ఞత, బాధ్యతా కనపడవు. గుడి కుల్చేసారు సర్ అంటాడు ఒక్కడు. అంత రాజధాని అవసరమా అంటాడు మరొకడు. ఇన్ని సార్లు కొరియా, స్విట్జర్ల్యాండ్ లాంటి దేశాలకు వెళ్ళటం అవసరమా అంటాడు మరో అపర మేధావి. ఇది వీరి ఐ.క్యు. స్థాయి.

bjp 01032018 3

దుర్గ గుడి ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా 2016లో ఒక గుడి తప్పనిసరై తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో సోషల్ మీడియాలో దీని మీద చాలా వాదనలు నడిచాయి. బా.జ.ప. పాలిస్తున్న రాస్త్రాల్లో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి. స్వయంగా గుజరాత్ తో సహా. ఈ బీజేపీ మేధావులు అవి మాట్లాడరు. కేంద్రం తాను చేసిన హామీల నుండి వెనక్కి వెళ్ళింది, విభజన హామీల విషయంలో మోసం చేసింది అంటే, ఈ మేధావులు అప్పుడు గుళ్ళు కూల్చారు అండీ అంటారు. ఏమనాలి వీళ్ళని? హుధుద్ తూఫాన్ తరవాత మా విజయమ్మను ఓడించటం వలెనే ఇలా జరిగింది అని తమ నీచమైన బుద్ధిని బయటపెట్టుకున్న ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు కంటే వీరు ఏ విధంగా బెటర్??

bjp 01032018 2

అంత ఖర్చుపెట్టి రాజధాని అవసరమా అంటాడు మరో బడాయి మేధావి. తెలుగు ప్రజలు అద్భుతమైన రాజధాని నిర్మించుకోవాలి అని కలగన్నారు సరే...మరి ఆ రోజు మోడీ చెప్పింది ఏంటి? ఢిల్లీ కంటే గొప్ప రాజధాని నిర్మిస్తాము అని చెప్పింది ఎవరు?? వీళ్ళ తాతలు దిగి వచ్చి చెప్పారా? రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. ప్రధానమంత్రి పదవిలో మోడీ, ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు శాశ్వతంగా ఉండరు. కానీ వారు చేసే అభివృద్ధి శాశ్వతంగా ఉంటుంది. అమరావతి నిర్మితమైతే ఎన్నో భవిష్యత్తు తరాలకు అవసరాలు తీరుస్తుంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు మరో నగరాన్ని ఆడ్ చేశారు చంద్రబాబు నాయుడు. అదే సైబరబాద్. కొండలు,గుట్టలు ప్రాంతాన్ని బెస్ట్ ప్లేస్ తో లివ్ గా మార్చటానికి అడుగులు వేశారు. తరవాత ప్రభుత్వాలు మరికొంత చేశాయి, చేస్తున్నాయి. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు హైద్రాబాద్లో లేరు. బట్, అయన విజన్, కష్టం అలాగే ఉన్నాయి కొన్ని లక్షలమందికి ఉపాధి కల్పిస్తూ. మానసికంగా ఈ పరిపక్వత సాధించిన రోజున ఎవడికైనా రాజకీయాల గురించి మాట్లాడే అర్హత ఉంటుంది. అది లేకపోతే రాజకీయాలు గురించి మాట్లాడటం ఒక మానసిక రుగ్మత అవుతుంది."

Advertisements

Advertisements

Latest Articles

Most Read