ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల విషయంలో, పక్కన ఉన్న తెలంగాణా రాష్ట్రంతో పోరాడి మరీ సాధిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అధికారులు.. రైతులకి నీరు ఇవ్వటం కోసం, ప్రతి సంవత్సరం కొట్లాడుతూనే ఉన్నారు... తాజాగా మరో సారి, తెలంగాణా అధికారులతో కోట్లాడి మరీ నీరు సాధించారు... నాగార్జున సాగర్ కుడికాల్వకు నీటి విడుదలపై ఏపీ నీటి పారుదలశాఖ అధికారులు, గత మూడు సంవత్సరాలుగా పంతం నేగ్గించుకుంటున్నారు. కృష్ణా బోర్డుని ఒప్పించి మరీ, తెలంగాణ అధికారుల చేత గురువారం 2వేల క్యూసెక్కుల నీటిని కుడి కాల్వకు విడుదల చేపించారు ఏపి అధికారులు.
రాష్ట్ర విభజన అనంతరం 2015ఫిబ్రవరి 11న నీటి కోసం సాగర్ ప్రధాన డ్యాంపై ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖాధికారులు, పోలీసులు బాహాబాహీకి దిగిన విషయం తెలిసిందే. తర్వాత 2017 మే 1న కుడి కాల్వకు కేటాయించిన కోటా పుర్తవకుండానే నీటి విడుదలను తెలంగాణ అధికారులు నిలిపివేయ గా, ఏపీ అధికారులు మరోసారి గొడవకు దిగారు. ఈ రెండు సార్లు, ఏపి అధికారులు, కృష్ణా నది బోర్డుతో పోరాడి, నీరు విడుదుల చేసుకున్నారు.. తాజాగా బుధవారం మరోసారి ఇలాంటి గొడవే జరిగింది.
తెలంగాణా అధికారులు నీరు ఆపెయ్యటంతో, ప్రధానడ్యాంపై ఉన్న కంట్రోల్‌రూంకు వచ్చిన ఏపీ అధికారులు మరో రెండు రోజు లు నీటి విడుదల కొనసాగించాలంటూ వాగ్వాదానికి దిగారు. దీని పై మరో సారి ఏపి అధికారులు కృష్ణా బోర్డును సంప్రదించగా, 2వేల క్యూసెక్కుల చొప్పున ఐదు రోజులు నీరు విడుదల చేయాలని సూచించింది... ఈ మేరకు గురువారం ఉదయం 9 గంటల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు... ఈ విధంగా, గత మూడు సంవత్సరాల నుంచి, నీటి కోసం, ఏపి అధికారులు తెలంగాణాతో పోరాడుతూనే ఉన్నారు..