ముఖ్యమంత్రి కుర్చీ కోసం పాదయాత్ర చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, పాదయత్ర స్టైల్ గురించి అందరికీ తెలిసిందే... వారానికి ఒక రోజు, శుక్రవారం కోర్ట్ కి పోవాలి.. అందుకోసం గురువారం మధ్యాహ్నం నుంచే మనోడు జంప్ అవుతాడు... గట్టిగా నడిచేది 5 రోజులు... మళ్ళీ మధ్యలో పండుగలు అని, అదని, ఇదని, హాలిడే తీసుకుంటాడు... అయితే పోయిన వారం, గురువారం ఉదయమే హైదరాబాద్ చెక్కేసాడు... రెండు రోజులు హాలిడే తీసుకున్నాడు... పోయిన శుక్రవారం విచారణలో, కేసు వాయిదా పడిన సందర్భంలో, జడ్జి గారు, మళ్ళీ వాయిదా, మర్చి 9 కి వాయిదా వేసారు... అంటే, రేపు మర్చి 2న సెలవు లేదు... దీంతో మనోడికి గుండెల్లో గుబులు మొదలైంది...
అలవాటు పడిన ప్రాణం... ఒక్క రోజున్నా రెస్ట్ తీసుకోకపోతే ఉండలేడు... అందుకే సెలవు కోసం ఒక ప్లాన్ వేసాడు... కేంద్రం అన్యాయం చేస్తుంది అంటూ, ఈ రోజు కలెక్టరేట్ ల ముట్టడి అని పిలుపు ఇచ్చారు... అందుకే, అందరూ గట్టిగా కలెక్టరేట్ ల ముట్టడి అంటూ ఈ రోజు పాదయాత్రకి హాలిడే ప్రకటించారు.. సరే, కేంద్రం మీద పోరాటం కదా, తప్పేముందిలే అని అనుకున్నారు అందరూ... జగన్ కూడా, ఇరగ దీసుకుని ఆందోళన చేస్తారేమో అని ఊహించారు... తీరా చుస్తే, సీన్ వేరేలా ఉంది..
అందరినీ కలెక్టరేట్ ల ముట్టడి చెయ్యమని పంపించి, మనోడు నిన్న రాత్రి టెంట్ లో కి వెళ్లి, ఇప్పటి వరకు బయటకు రాలేదు... ఎంతటి వారు వెళ్ళినా నో పర్మిషన్... పోనీ ఫ్యామిలీ ఏమన్నా వచ్చిందా అంటే ఇదీ లేదు... అర్జెంటు అయ్యా, కొంచెం మాట్లాడాలి అని, ఒక సీనియర్ నేత వెళ్తే, రేపు రమ్మని సెక్యూరిటీ పంపించి వేసారు... ఇది జగన్ తీరు... పాదయాత్రకి సెలవు కోసం,ఇది ఒక వంక... నిజంగా తనకి కేంద్రం పై పోరాటం చెయ్యాలనే చిత్తసుద్ధి ఉంటే, తన పార్టీ వారితో కలిసి ఆందోళన చేసే వాడు... మోడీ ఏమన్నా అంటాడు, అమిత్ షా తిడతాడు అని భయంతో, ఆందోళన పిలుపిచ్చి టెంట్ లో దూరాడు...