2014 ఎన్నికల్లో, తెలుగుదేశం, బీజేపీ కలిసి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో, అక్కడ తెలంగాణాలో కలిసి పోటీ చేసిన సంగతి తెలిసిందే... అయితే, ఆంధ్రప్రదేశ్ లో పొత్తులోనే ఉన్నాం అని చెప్తూ, తెలంగాణాలో మాత్రం తెలుగుదేశంతో పొత్తు లేదు అని బీజేపీ నాయకులు చెప్తూ వస్తున్నారు.. చివరకు అమిత్ షా కూడా, ఇదే మాట చెప్పారు... ఈ విషయం పై చంద్రబాబు ఈ రోజు స్పందించారు... ఈ రోజు చంద్రబాబు చాలా రోజుల తరువాత హైదరాబాద్ వెళ్లారు... హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులను ఆయన కలిశారు... తెలంగాణలో టీడీపీ బలోపేతం పై చర్చించారు...
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘2014 ఎన్నికల సమయంలో బీజేపీతో పెట్టుకున్నాం. మనం ఇరవై సీట్లు గెలిచాం. ఆ సందర్భంగా ఒక ఎమ్మెల్సీని కూడా గెలిపించాం. తర్వాత వచ్చిన రాజకీయ పరిణామాల్లో మనకు చెప్పకుండానే బీజేపీ తెలుగుదేశం పార్టీతో పొత్తు లేదని వాళ్లే ప్రకటించారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఏది చేసినా చెప్పి చేయాలి. కానీ బీజేపీ అలా చేయలేదు" అంటూ బీజేపీ వైఖరని ఎండగట్టారు.. బీజేపీ ఆడుతున్న ద్వంద్వ వైఖరి పై ఇప్పటికే తెలంగాణాలో నేతలు గుర్రుగా ఉన్నారు...
మరో పక్క ఆంధ్రప్రదేశ్ లో, తెలుగుదేశం పార్టీకి మిత్రపక్షం అంటూనే, రోజు సోము వీర్రాజు లాంటి నేతలు బూతులు తిడుతూ ఉంటారు... రాష్ట్రానికి అన్యాయం జరిగింది అయ్యా అంటే, మా మోడీ ఎంతో చేస్తున్నారు, ఇంకా చెయ్యల్సింది ఏమి లేదు, చంద్రబాబు ఇచ్చిన డబ్బులు అన్నీ తినేస్తున్నారు అంటూ, పిచ్చ ప్రచారం చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో రోజులు గడుపుతుంది... తాజాగా తెలంగాణా విషయంలో బీజేపీ వైఖనికి చంద్రబాబు బహిరంగంగానే ఎండగట్టారు... ఈ వ్యాఖ్యల, ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై కూడా పడే అవకాసం ఉంది...