లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో భాజపా అగ్రనేత అద్వానీ సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో నిరసన తెలిపేందుకు గల కారణాలను తెలుగుదేశం పార్టీ ఎంపీలు అడ్వాణీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం న్యాయం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం... ఒకరినొకరు గౌరవించుకోవాలని, సభా మర్యాదలు కాపాడాలని అద్వానీ సూచించారు. ఇదే సందర్భంలో అద్వానీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి... బీజేపీ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ, టిడిపి ఎంపీలతో, అద్వానీ కీలక వ్యాఖ్యలు చేసారు...
అన్ని విషయాలు నాకు తెలుసని, ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయంతో ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసని, మరి కేంద్రం ఇలా ఎందుకు వ్యవహిరిస్తుందో అర్ధం కావటం లేదు అంటూ, కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలే హాట్ టాపిక్ అయ్యాయి. చట్టం ఉన్నవాటికి కేంద్రం ఏమాత్రం నిధులు కేటాయించకపోవడంతో ఎంపీలు పూర్తిస్థాయిలో నిరసన బాట పట్టారు. నాలుగు రోజుల పాటు ఉభయసభల్లోనూ ఎంపీలు ఆందోళన కొనసాగించారు...
ఎంత తీవ్ర స్థాయిలో పోరాటం చేసినా కేంద్రం ఏమాత్రం దిగిరాకపోవడంతో కేంద్రమంత్రి సుజనాచౌదరి నేరుగా అరుణ్‌జైట్లీతో వాగ్వాదానికి దిగడం టీడీపీలో నెలకొన్న అసంతృప్తి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు తొలివిడత కీలకమైన రాజకీయ మార్పులకు కారణమయ్యాయి. నాలుగేళ్ల పాటు విభజన హామీలను అమలు చేస్తారని ఎదురు చూస్తూ వచ్చిన టీడీపీ పోరుబాట పట్టింది. అంటే ఓ రకంగా టీడీపీ ఇక మిత్ర పక్షంగా వ్యవహరించడం కష్టమే. అదే సమయంలో దేశ రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నారు.