కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టి వారం అయ్యింది... సరిగ్గా వారం క్రితం ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు... ఆ అపోహలు అన్నీ పటాపంచలు అయిపోయాయి... మేము అనుకున్నదాని కంటే, ఎక్కువే చేసారు చంద్రబాబు అనుకుంటున్నారు ప్రజలు.... సరిగ్గా వారం క్రితం, సొంత పార్టీ వాళ్ళే చంద్రబాబు పై విమర్శలు చేసారు... మరీ ఇంత డిఫెన్సు గేమ్ ఆడితే ఎలా చంద్రబాబు అంటూ నెటిజ‌న్లు పోస్ట్ లు పెట్టారు... అనేక అనుమానాలు, అనేక సందేహాలు.. బాబు ఏం చేస్తున్నారు? ఏపీని ఆయ‌న ముంచేస్తారా? ఇంత జరుగుతున్నా కూడా ఆయ‌న ఇంకా మిత్ర‌ధ‌ర్మం అంటూ ప‌ట్టుకు వేళ్లాడుతాడా? ఆయ‌నేం చేయ‌లేడా ? కేంద్రాన్ని లైన్లోకి తీసుకురాలేడా? వ‌ంటి అనేకానేక సందేహాలు... దీంతో గ‌త శుక్ర‌, శ‌నివారాల్లో నెటిజ‌న్లు చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపైనా, టీడీపీ ఎంపీల‌పైనా భారీ స్థాయిలో విరుచుకుప‌డ్డారు....

కాని చంద్రబాబు మాత్రం ఎక్కడా బ్యాలన్స్ తప్పలేదు... పర్ఫెక్ట్ గా గేమ్ స్టార్ట్ చేసారు... త‌న రాజ‌కీయ చ‌మ‌త్కారం ఏమిటో చూపించారు... అప‌ర చాణిక్యుడిగా పేరొందిన త‌న విశ్వ‌రూపం ఏంటో కేంద్రానికి చూపించారు... ఏపీ స‌మ‌స్య‌ను దేశ స‌మ‌స్య‌గా మార్చాల‌ని అప్ప‌టిక‌ప్పుడు ప‌క్కా ప్లాన్ సిద్ధం చేశారు... ఎంపీల‌ను అలెర్ట్ చేశారు... బీజేపీపై ఎలాంటి విమ‌ర్శ‌లు చేయ‌కుండా త‌న వేలితో త‌న క‌న్నును ఎలా పొడిపించాలో స్కెచ్ సిద్ధం చేశారు.... ఎంపీల‌ను పిలిపించి త‌న ప్లాన్ వివ‌రించారు.... ప‌క్కాగా అమ‌లయ్యేలా.. అమ‌లు చేసేలా తెర వెనుకే ఉండి మంత్రాంగం న‌డిపించారు... తెలుగు వారి ఆత్మ గౌర‌వం ఎలా ఉంటుందో కేంద్రం చ‌వి చూసింది... అటు రాజ్య‌సభ‌, ఇటు లోక్‌స‌భ‌లో టీడీపీ ఎంపీలు తీవ్ర స్థాయిలో ఉద్య‌మాన్ని ముందుకు న‌డిపించారు...

నిజానికి టిడిపి ఎంపీలు ఈ రేంజ్ లో ఆందోళన చేస్తారని ఎవరూ ఊహించలేదు... అటు కేంద్రమే కాదు, ఇక్కడ ఉన్న ప్రతిపక్షం కూడా అవాక్కయింది... ప్ర‌ధానిగా మోడీ బాధ్య‌తలు స్వీక‌రించాక ఏపీ గురించి మొదటి సారి పార్ల‌మెంటులో మాట్లడారు.. జైట్లీ మూడు సార్లు ప్రకటన చేసారు.... ఇక‌, గ‌ల్లా జ‌య‌దేవ్‌ స్పీచ్ అయితే, అన్నిటికంటే హైలైట్... మీకు మేం కావాలో? అవినీతిలో జైలుకు వెళ్లి ఏడాదిపైగా జైల్లో ఉండి వ‌చ్చిన జ‌గ‌న్ కావాలో తేల్చుకోవాల‌ని అల్టి మేటం ఇచ్చారు... ఏపికి న్యాయం చెయ్యల్సింది మీరే, కాంగ్రెస్ గతి పట్టించుకోవద్దు అంటూ అల్టిమేటం ఇచ్చారు.. ఫ‌లితంగా ఇప్పుడు ఏపీ ప్ర‌జ‌ల ఆశ‌ల బంతుల‌న్నీ, కేంద్రం కోర్టులో ప‌డ్డాయి... ఇప్పుడు ఎవ్వ‌రూ బాబును వేలెత్తి చూపించ‌లేని ప‌రిస్థితి వ‌చ్చేసింది... అదే స‌మ‌యంలో వామ‌ప‌క్షాలు ఇచ్చిన పిలుపును సైతం చంద్ర‌బాబు మ‌న్నించారు. బంద్‌లంటే ఇష్ట‌ప‌డ‌ని బాబు సైతం తెలుగు దేశం పార్టీ శ్రేణులు కూడా నిర‌స‌న తెలిపి ఏపీ కోసం ఉద్య‌మించాల‌న్నారు... ఈ విధంగా, ఎవరూ ఊహించని విధంగా చంద్రబాబు మొదటి అడుగులోనే అబ్బురపరిచారు... ఇక ఎన్ని అడుగులు ఉన్నాయో, ఎన్ని మార్గాల్లో కేంద్రం పై ఒత్తిడి తెస్తారో, లేక ఇక తెల్చుకుంటారో వేచి చూడాలి... ఒకటి మాత్రం నిజం... తెలుగుదేశం కార్యకర్తలకి, బీజేపీని వదిలించుకుంటే వచ్చే ఓట్లు కనిపిస్తున్నాయి.. రాష్ట్రానికి వచ్చే డబ్బులు కంటే ఓట్లు ఎక్కువయ్యాయి.... కాని చంద్రబాబు గారికి వచ్చే ఓట్లు కంటే .. ఏపీ కి వచ్చే డబ్బులు గురుంచి ప్రయత్నం చేస్తున్నారు.... చంద్రబాబు గారు, చివరకు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం... ఎందుకంటే, ఆయన గెలిస్తే, రాష్ట్రం కూడా గెలుస్తుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read