నవ్యాంధ్రకు జరిగిన అన్యాయం పై ఢిల్లీ పై ధిక్కారం కొనసాగించాలని, ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు... విభజన హామీల అమలు కోసం ఉభయ సభల్లో ఆందోళనను ఉధృతం చేయాలని టీడీపీ ఎంపీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్‌పై అరుణ్‌జైట్లీ సమాధానం చెప్పేటప్పుడు ఎంపీలు ఆందోళన కొనసాగించాలని సూచించారు. రాజ్యసభలోనూ నిరసన కొనసాగించాలని టీడీపీ ఎంపీలకు సీఎం సూచన చేశారు...
ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న పార్లమెంట్ ఉభయసభల్లో మన ఎంపీలు బాగా పనిచేశారన్నారు. ఎంపీ గల్లా జయదేవ్ ప్రసంగాన్ని సీఎం అభినందించారు. ఎక్కడైనా ప్రతిపక్షం ముందు ఉండి ఆందోళనలు చేయాలి... కానీ కేసుల భయంతో వైసీపీకి ఆ పరిస్థితి లేదన్నారు. ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ కి సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని ఆయన అన్నారు... దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు అండగా ఉండాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.... భారతదేశంలో ఏపీ భాగం కాదా?... ఎందుకు ఇంత వివక్ష అని బాబు ప్రశ్నించారు.... ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర సమస్య ఇంతగా నలిగిన సందర్భం లేదన్నారు... ఎంపీలంతా సభలో బలంగా వాయిస్ వినిపించాలని... మన పోరాటం జాతీయ స్థాయికి ఇంకా బలంగా వెళ్ళాలని చంద్రబాబు పిలుపునిచ్చారు...