బడ్జెట్‌పై చర్చకు ఆర్థికమంత్రి జైట్లీ సమాధానం ఇస్తున్న సమయంలో, తెలుగుదేశం ఎంపీలు జైట్లీని చుట్టుముట్టి, ముందు మా రాష్ట్రం గురించి మీరు మాట్లాడండి... మా సమస్య గురించి చెప్పే, మీరు మిగతా స్పీచ్ ఇవ్వండి అంటూ, జైట్లీని చుట్టుముట్టారు... దీంతో జైట్లీ, నేను మీ గురించి చెప్తాను, ఒక్క 15 నిమషాలు మీరు ఓపిక పట్టండి అంటూ, మీ గురించే చెప్తాను నాకు టైం ఇవ్వండి అంటూ, సముదాయించారు... దీంతో మన ఎంపీలు జైట్లీ పక్కనే నుంచున్నారు... జైట్లీకి మధ్య మధ్యలో గుర్తుచేస్తూనే ఉన్నారు.. చివరకు జైట్లీ ప్రకటన చేసారు... పాడిందే పాట పాడారు జైట్లీ...
పీ గురించి మాట్లాడిన ఆయన.. ఏపీకి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు కానీ కొద్దిగా భారం తగ్గితే ఏపీలాంటి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందన్నారు. పోలవరానికి ఇస్తున్నాం, ఆర్ధిక లోటు గురించి చర్చిస్తున్నాం, విద్యా సంస్థలకు ఎన్నో నిధులు ఇచ్చాం, ఇంకా ఇస్తాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అంటూ, పాడిన పాటే పాడారు.... జైట్లీ ఇవాళ ఎదో ఒక ప్రకటన చేస్తారు అని, ప్రజలు కూడా బంద్ చేసారు కాబట్టి, ప్రజలకు కూడా సమాధానం చెప్తారని అందరూ అనుకున్నారు... బీజేపీ కూడా అలాగే లీక్‌లు ఇచ్చింది...
చివరకు జైట్లీ మాటలు విన్న ప్ర్జాలు, పార్లమెంట్ లు ఉన్న ఎంపీలు భగ్గుమన్నారు... వెంటనే ఆందోళన బాట పట్టారు... నినాదాలు, ఆందోళన మధ్యనే, పార్లమెంట్ వాయిదా పడింది... ఓ వైపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగిస్తుండగా ఏపీ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ జైట్లీ మాత్రం చెప్పాల్సినవన్నీ చెప్పేశారు.... ఎంపీల నిరసనల మధ్య లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ...