వినూత్నశైలిలో నిరసన తెలపడంలో టీడీపీ ఎంపీ శివప్రసాద్ కు మించినవారు మరెవరూ ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు... ఈరోజు కూడా ఇలాగే వినూత్న పద్ధతిలో ఆందోళన చేపట్టారు. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ తో తెలుగుదేశం ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తిరుమల వెంకన్న పాదాల సాక్షిగా ఏపీ డిమాండ్ లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు... కాంగ్రెస్ ఇప్పటికే పెద్ద తప్పు చేసింది... మీకు కూడా వాళ్లకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
తలకు పోడవాటి వెంట్రుకల విగ్గు ధరించి, అఘోరా వేషం వేశారు. మెడలో రుద్రాక్షమాల, ఒక చేతిలో పాము, మరో చేతిలో నిమ్మకాయ గుచ్చిన కత్తిని పట్టుకుని నిరసన తెలిపారు.... ఏడుకొండల సామి, దుర్గమ్మ తల్లి పూనారు అంటూ, మాకు ఎప్పుడు సహాయం చేస్తావ్ మోడీ గారు అంటూ, పాటలు పడుతూ నిరసన తెలిపారు... ఏడుకొండలు సాక్షిగా చెప్పావ్, అమరావతి వచ్చి, దుర్గమ్మ సాక్షిగా చెప్పావ్, ఇంకా ఎప్పుడు హామీలు తీర్చుతావ్ అంటూ వినూత్న ఆందోళన చేసారు...
అయితే ఇదే వేషధారణతో సభ మొదలైన 5నిమిషాల తర్వాత ఎంపీ శివప్రసాద్ లోనికి ప్రవేశించారు. అతని వేషధారణను చూసిన స్పీకర్ సుమిత్రామహాజన్ ఏదో జరగబోతోందని భావించి లోక్ సభను వాయిదా వేశారు... శివప్రసాద్ గత మూడు రోజులుగా నారదుడి వేషంలో, తప్పెటగూళ్ల వేషధారణలో ఢమరుకం మోగిస్తూ ఆందోళన చేసారు... గోవిందా గోవిందా అంటూ నిరసన చేపట్టారు... ఇన్ని వినూత్న నిరసనలు చేసి, మిగతా ఎంపీలకు, మన రాష్ట్ర సమస్యల గురించి, వారు మద్దతు పలికేలా చేస్తున్నారు...