పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన తెలుపుతోన్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలో లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్నారు... మరోవైపు రాజ్యసభలో టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామ లక్ష్మి తమ ఆందోళనను కొనసాగించడంతో వారిని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సస్పెండ్ చేశారు.. బయటకు వెళ్లకపోవటంతో, మార్షల్స్ చేత బయటకు పంపించారు..
అయితే వైసిపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం, మాట మాట్లాడకుండా సీట్ లో కూర్చున్నారు... కొంచెం సేపతకి బయటకి వెళ్ళిపోయారు... ఒక పక్క సాటి ఎంపీలు ఆందోళన చేస్తున్నా, కిక్కురుమనకుండా, కూర్చుని వినోదం చూసారు... మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావుని కూడా ఉదయమే బయటకు వెళ్ళిపోమని చైర్మన్ చెప్పారు... కేవీపీ రామచంద్రారావు బుధవారం మనస్తాపానికి గురై రాజ్యసభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటూ కేవీపీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
అయితే... బుధవారం కూడా కేవీపీ ఓ ప్లకార్డు పట్టుకుని వెల్‌లోకి వెళ్లారు. కాగా.. వెల్‌లో నుంచి వెనక్కి రావాలని కాంగ్రెస్ ఎంపీలు సూచించారు. అంతేగాక కేవీపీ ప్రవర్తనను మేము సమర్ధించబోమని విపక్ష నేత ఆజాద్ అన్నారు. దీంతో కేవీపీకి కాంగ్రెస్ సభ్యుల మద్దతు లభించలేదు. వెల్‌లోనే కేవీపీ ఉండగా 256 నిబంధన కింద బయటకు వెళ్లాలని ఆదేశిస్తామని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశిస్తామమని పేర్కొనడంతో దీనికి మనస్తాపానికి గురైన కేవీపీ బయటకు రాజ్యసభ నుంచి బయటకు వచ్చేశారు.