ఈ రోజు ఉదయం టీడీపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో టీడీపీ కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే... బీజేపీ వైఖరి పై విసుగెత్తిపోయిన చంద్రబాబు, కేంద్రం పై పోరాటం చెయ్యటానికి సిద్ధం అయ్యారు... రాష్ట్ర ప్రయోజనాల కోసం జాతీయస్థాయి పోరాటానికి సిద్ధం కావాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలకు.. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు లేఖలు రాయాలని నిర్ణయించింది. విభజనచట్టం హామీలు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు హోదా-ప్యాకేజీ మతలబును లేఖలో వివరించాలని నిర్ణయం తీసుకున్నారు.

amith phone 02032018 2

మిత్రపక్షం అయినా సరే, ఎందుకు కేంద్రం పై పోరాడుతున్నమో చెప్పదలుచుకున్నారు... అయితే, ఈ పరిణామంతో, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అలెర్ట్ అయ్యారు... ఇలా చేస్తే, బీజేపీ కి రాజాకీయంగా నష్టం అనుకున్నారో ఏమో కాని, వెంటనే చంద్రబాబుకి ఫోన్ చేసారు.. మీరు వెంటనే ఢిల్లీ రండి... సోమవారం మీరు వస్తే, అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ, అమిత్ షా చంద్రబాబుని కోరారు... విభజన హామీల పై చర్చిద్దాము రండి అన్నారు...

amith phone 02032018 3

దీని పై చంద్రబాబు స్పందిస్తూ, నేను ఢిల్లీ రావటం కుదరదు అని చెప్పేసారు.. అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయనే వంక చెప్పారు... కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబరావులను చర్చలకు పంపుతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదిలేదని అమిత్‌షాకు చంద్రబాబు తేల్చిచెప్పారు... అయితే నిన్ననే అమిత్ షా, వెంకయ్య సమక్షంలో చర్చలు జరపగా, ఇంకా ఇంతకూ మించి ఏమి చెయ్యలేమని, కొన్ని అంశాలు చేద్దాం, చూద్దాం అని చెప్పటంతో, విసుగెత్తిపోయి, చంద్రబాబు ఈ రోజు ఉదయం, అన్ని రాజకీయ పార్టీలకు కేంద్ర వైఖరి గురించి లేఖలు రాయటానికి రెడీ అయ్యారు... ఇలాంటి సమావేశాలతో టైం పాస్ తప్ప, చేసేది ఏమి ఉండదు అని చంద్రబాబు అభిప్రాయం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read