జగన్ మోహన్ రెడ్డి అవిశ్వాసం డ్రామా వెనుక ఎంత క్రిమినల్ మైండ్ దాగుందో తెలుసా ? ప్రజలని జగన్ బ్యాచ్ ఎలా పిచ్చోల్లని చెయ్యాలని భావించిందో తెలుసా ? వేసే డ్రామాలు వెయ్యక, పెద్ద పోటుగాడిలా పవన్ ని కెలిక, ఇప్పుడు మెడకు చుట్టుకునేలా చేసుకున్నాడు జగన్... అసలు జగన్, మోడీ మీద అవిశ్వాసం పెట్టే దమ్ము ఉందా అని అందరూ అనుకున్నారు... నోటి మాట వేరు, ఒక సంతకం పెట్టి, మోడీ మీద నాకు విశ్వాసం లేదు అని చెప్పటం వేరు... జగన్ అంత సాహసం చెయ్యగలడా ? మరి అవిశ్వాసం డ్రామా ఏంటి ? బీజేపీతో ఒప్పందం చేసుకున్నాడా ? అసలు జగన్ ప్లాన్ ఏంటి ? ఇది తెలిస్తే, జగన్ ప్రజలని ఎలా పిచ్చోల్లని చేద్దామనుకున్నాడో అర్ధమవుతుంది...
మార్చి 21న అవిశ్వాసం పెడతామంటుంది వైసీపీ.. అయితే దీని వెనుక, ఎన్నో లెక్కలు ఉన్నాయి... అచ్చం మన A1, A2 లెక్కలు లాగా... నిజానికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కనీసం 50 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ వైసీపీకి ఐదుగురు సభ్యులే ఉన్నారు. ఈ క్రమంలో వివిధ పార్టీల మద్దతు కూడగట్టడానికి సమయం తీసుకొని మార్చి 21న పెట్టాలని వైసీపీ అనుకుంటోంది. లోక్‌సభ 198వ నిబంధనను అనుసరిస్తూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలి. ఈ నిబంధన ప్రకారం 50 మంది ఎంపీలు దానికి మద్దతిస్తే అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అంగీకరిస్తారు.
అయితే దీనికి వెంటనే సమయం కేటాయించరు. నిబంధనల మేరకు తీర్మానాన్ని అంగీకరించిన 10 పని దినాల్లో ఎప్పుడైనా స్పీకర్ చర్చకు సమయం కేటాయించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 6న పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి. వైసీపీ మార్చి 21న తీర్మానం పెడితే సరిగ్గా 10వ పనిదినాన సభ ముగుస్తుంది. ఈ లెక్కలన్నీ ముందే వేసుకుని అవిశ్వాస తీర్మానం 21న పెట్టాలని వైసీపీ భావిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే మరో వాదన ప్రకారం, అవిశ్వాస తీర్మానం చర్చకు రావాలంటే కనీసం రెండు వారల ముందు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలి.. ఇలాగే పోయిన సారి సమైఖ్య ఉద్యమం అప్పుడు, నోటీసు తిరస్కరించారని గుర్తు చేస్తున్నారు.. ఇవన్నీ లెక్కలోకి వేసుకుని, జగన్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు... లేకపోతే, నీ మీద నాకు విశ్వాసం లేదు మోడీ, అని రికార్డెడ్ గా చెప్పే దమ్ము జగన్ కు ఉందా ?