ఈ నెల ఐదు నుంచి జరగనున్న రెండోవిడత పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం ఉండవల్లిలో జరిగిన విషయం తెలిసిందే... ఇప్పటికిప్పుడు కేంద్ర మంత్రులు రాజీనామా చేసేస్తే... తెదేపాని మరో ప్రతిపక్షంలానే భాజపా చూస్తుందని, ప్రభుత్వంలో ఉంటూనే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివిధ మార్గాల్లో ఎలుగెత్తి చాటడంతో పాటు, కేంద్ర ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడి పెంచాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఒకేసారి అస్త్రాలన్నీ వాడేయకుండా... దశలవారీగా పోరాటాన్ని ఉద్ధృతం చేస్తూ వెళ్లాలని నిర్ణయించారు..

modi amit shah 03032018 2

తెలుగుదేశం వ్యూహం ప్రకారం, ఈ నెల 5 నుంచి పార్లమెంటులో ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని, వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేస్తారు. పార్లమెంటు వెలుపలా నిరసన కొనసాగుతుంది. ఆర్థిక బిల్లుకి సవరణలు ప్రతిపాదించినప్పుడైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయం చేస్తుందేమో చూస్తారు. అప్పటికీ స్పందన లేకపోతే ఆ తర్వాత పోరాటం మరింత ఉద్ధృతం చేస్తారు. కార్యాచరణను ఎప్పటికప్పుడు నిర్ణయించుకుంటారు. అదే సమయంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ, తాము చేస్తున్న పోరాటానికి మద్దతు కోరుతూ వివిధ జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులకు తెదేపా జాతీయ అధ్యక్షుడి హోదాలో ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖలు రాస్తారు. ఆ లేఖల్ని పార్లమెంటులోని వివిధ పార్టీల ఎంపీలకూ అందజేస్తారు.

modi amit shah 03032018 3

అయితే, కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఇలా చేస్తే, తమకు మరింత ఇబ్బంది అవుతుందని, మొన్న జరిగినట్టు జరిగితే, టిడిపి ఎంపీలు పార్లమెంట్ సమావేశాలు మొత్తాన్ని హైజాక్ చేస్తారని, అదీ కాక మిత్రపక్షం ఇలా చేస్తుంది అనే సంకేతం వెళ్తుంది అని , అందుకే తొలి రోజే టిడిపి ఎంపీలను సస్పెండ్ చెయ్యాలని, బీజేపీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది... ఇలా చేస్తే, తెలుగుదేశం కూడా మరింత దూరం అవుతుంది అని, వారు బీజేపీని వదిలి వెళ్ళే పరిస్థితి కల్పిస్తే, మనకే మంచిదని, అప్పుడు టిడిపి చేసే ఆందోళనకు పెద్దగా గుర్తింపు ఉండదని, బీజేపీ వ్యూహంగా తెలుస్తుంది.. అందుకే, ముందు టిడిపి ఎంపీలను ముందు రోజే సస్పెండ్ చేసి, వారిని పొమ్మనకుండా పొగ పెట్టే కార్యక్రమం చేస్తుంది బీజేపీ...

Advertisements

Advertisements

Latest Articles

Most Read