ఉదయం అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం పూర్తయిన వెంటనే, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఢిల్లీని పంపించారు చంద్రబాబు... కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన వాటిపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం అమిత్ షా ఫోన్ చేసిన సంగతి తెలిసిందే... ఆ సమయంలో చంద్రబాబు నేను ఢిల్లీ రావటం కుదరదని, నా తరుపున ప్రతినిధులని పంపిస్తా అని, కేంద్రమంత్రి సుజనా, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వస్తారని అమిత్ షా తో చెప్పారు... అయితే ఈ సమావేశం ఈ రోజు సాయంత్రం 7 గంటలకు అమిత్ షా నివాసంలో జరగనుంది...
కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు, మరి కొంత మంది మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గుననున్నారు... అయితే, సుజనా, రామ్మోహన్ నాయుడు, కుటుంబరావుతో పాటు, రాష్ట్ర ఆర్ధిక మంత్రి యనమల కూడా ఉంటే, మరింత లోతుగా చర్చలు జరగే అవకాసం ఉంటుంది అని, మన తరుపున ఏ తప్పు లేకుండా, రాష్ట్ర ఆర్ధిక మంత్రిని కూడా చంద్రబాబు పంపించారు... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయం, ఆర్ధిక లోటు విషయం పై ఈ సమవేసలో క్లారిటీ వచ్చే అవకాసం ఉంది అని చెప్తున్నారు...
అయితే, ఈ సమావేశం పై కూడా చంద్రబాబు పెద్దగా ఆసలు పెట్టుకోలేదు... ఇలాంటివి చాలా జరిగాయని, మనం చాలా విషయాల్లో వెనక్కు తగ్గినా, కేంద్రం మాత్రం సహకరించటం లేదని చంద్రబాబు అంటున్నారు.. అయితే, వారు పిలిచినప్పుడు, వెళ్ళాలి కాబట్టి, ముఖ్యమంత్రిని స్వయంగా రమ్మన్నా, చంద్రబాబు తాను వెళ్ళకుండా, ప్రతినిధులని పంపించారు... ఏ విషయం పై అన్నా స్పష్టత ఇచ్చి, రాష్ట్రానికి ఏమన్న చేస్తేనే, ఢిల్లీ వస్తానని, అప్పటి వరకు వచ్చేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు...