పార్లిమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, తెలుగుదేశం ఎంపీలు ఆందోళన చేసారు... విభజన హామీల అమలు చేయాలంటూ టీడీపీ ఎంపీలు ఆందోళన చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. సోమవారం ఉదయం పార్లమెంటు మలివిడత సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ మొదలైన వెంటనే టీడీపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. విభజన చట్టంలోని హామీలు అమలుచేయాలంటూ నినదించారు. దీంతో స్పీకర్ సుమిత్రామహాజన్ సభను గంటపాటు వాయిదా వేశారు.
మరో పక్క రాజ్యసభలో టిడిపి ఎంపీలు, కేవీపీ వెల్ లో ఆందోళన చేసారు... రాష్ట్రానికి న్యాయం చెయ్యాలని ప్లే కార్డులు పట్టుకుని ఆందోళన చేసారు... అలాగే రాష్ట్రము గురించి చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు... ఈ సమయంలో విజయసాయి రెడ్డి ఎక్కడున్నారా అని ప్రజలు టీవీల్లో చుస్తే, ఆయన ఎక్కడా కనిపించలేదు... సాక్షి టీవీ పెట్టి చుస్తే, ఒక వంద మంది వైసిపీ కార్యకర్తలతో కలిసి ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో ఒక మీటింగ్ పెట్టి, చంద్రబాబుని తిడుతూ, మాట్లాడుతున్నారు... మనలో మనమే, ఇలా మాట్లాడుకుంటే, ఎవడికి లాభం ?
ఢిల్లీకి వచ్చి, ఉభయసభల్లో ఆందోళన చేస్తే, మిగతా ఎంపీలకు, అదే విధంగా టీవీలలో చూస్తున్న దేశానికి తెలుస్తుంది... అప్పుడు బీజేపీ పై ఎమన్నా ఒత్తిడి వస్తుంది... అంతే కాని, ఒక చోటు చేరి, అదీ ఇక్కడ నుంచి జనాలని తోలుకుపోయి... తెలుగులో మాట్లాడుతూ, మనలో మనమే ప్రసంగించుకుంటూ, చంద్రబాబుని తిడితే, కేంద్రం పై ఏమన్నా ఒత్తిడి ఉంటుందా ? మొత్తానికి, రాజ్యసభలో విజయసాయి రెడ్డి లేకపోవటంతో, వారు ఎంత సీరియస్ గా ఉన్నారో, అక్కడే అర్ధమవుతుంది... సాక్షి ముందు స్పీచ్ లు ఇస్తే, ఎవరికి లాభం ?