నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్... ఆ ప్రాజెక్ట్ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుంది... కేంద్రానికి వదిలి పెట్టచ్చు కదా... వారు చెయ్యకపోతే, వారినే నిందించ వచ్చు అని అన్నారు... పవన్ గారు, ఇక్కడ ఆయన మీ లాగే అలోచించి, నిందలు వేసి, రాజకీయ లబ్ధి కోసం చూడటం లేదు... పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కోసం చూస్తున్నారు... అందుకే పోలవరం ప్రాజెక్ట్ బాధ్యత చంద్రబాబు తీసుకున్నారు... దగ్గర ఉంది ప్రాజెక్ట్ పూర్తయ్యేలా చేస్తున్నారు.. ఆయన డైరీలో సోమవారం, పోలవారం అయ్యింది... చేసిన పనులకి కేంద్రానికి లెక్కలు చెప్పి, డబ్బులు అడుగుతున్నారు.. దీంట్లో కూడా మీరు చంద్రబాబుని తప్పు పట్టటానికి ఏమి లేదు... కేంద్రం నిర్వహిస్తున్న 15 జాతీయ ప్రాజెక్ట్ ల దారుణ స్థితి ఇది... చంద్రబాబు అందుకే పోలవరం తీసుకుంది... ఆ వివరాలు చూడండి...
మన దేశంలో మొత్తం 16 నీటి పారుదల ప్రాజెక్ట్ లు, జాతీయ ప్రాజెక్ట్ లు గా ఉన్నాయి... జాతీయ ప్రాజెక్టులు దేశసంపదతో సమానం. వాటి నిర్మాణం, నిర్వహణ, పరిరక్షణ కేంద్ర ప్రభుత్వం బాధ్యత. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు కలిసికట్టుగా ఆ లక్ష్యాల సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలి. కాని, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగాల అలసత్వం, ప్రజాప్రతినిధుల అశ్రద్ధ వంటివి ప్రాజెక్టుల పరిపూర్తికి అడ్డంకులుగా మారాయి... ఇవన్నీ ఆలోచించే నీతి అయోగ్, మన రాష్ట్ర ప్రభుత్వాన్నే పోలవరం బాధ్యత తీసుకోమనగానే చంద్రబాబు ఒప్పుకున్నారు... కేంద్రం సహకరిస్తుంది అని చెప్పారు కాబట్టి, చంద్రబాబు నిర్వహణ బాధ్యత తీసుకున్నారు.. కాని కేంద్రం మాత్రం, నిధులు ఇవ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంది..
దేశంలో మొత్తం 16 ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించినా వాటి పనులు పూర్తి కాలేదు... అసోంలోని కుల్సి డ్యామ్, ఏపీలోని పోలవరం, అరుణాచల్ ప్రదేశ్‌లోని నోవా-దిహింగ్ ప్రాజెక్టు, అప్పర్ సియాంగ్ ప్రాజెక్టు, హిమాచల్‌ప్రదేశ్‌లోని రేణుకాడ్యామ్, ఉత్తరాఖండ్‌లోని కిషుయా బహళార్థ సాధక ప్రాజెక్టు, జమ్ము కశ్మీర్‌లోని ఉజ్, బుర్సార్, మహారాష్ట్రలోని గోసిఖుర్ద్, యూపీలోని కెన్బెట్వా, సరయు నహర్ పరియోజన, పంజాబ్‌లోని షాపూర్‌కండి, రవివ్యాస్, పశ్చిమ్ బంగలోని తీస్తా, ఉత్తరాఖండ్‌లోని లక్వార్ ప్రాజెక్టుల నిర్మాణం ఉన్నాయి... వీటిలో మన పోలవరంతో పాటు అన్ని ప్రాజెక్ట్ లు, దీర్ఘకాలంగా కొనసాగుతూనే ఉంది.
మొత్తం 16 నీటి పారుదల ప్రాజెక్ట్ ల ప్రస్తుత స్తితి చూస్తే, మన రాష్ట్రం నిర్వహిస్తున్న పోలవరం తప్పితే, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మిగిలిని అన్నీ ప్రాజెక్ట్ లు అసలు ముందుకు కదలటం లేదు... ఇంకా దారుణం ఏంటి అంటే, 10 ప్రాజెక్ట్ లు కనీసం రిపోర్ట్ దశను కూడా దాటలేదు... మిగిలిన 5 ప్రాజెక్ట్ ల పనులు అసులు జరగటం లేదు... 16 జాతీయ ప్రాజెక్ట్ లలో, మన పోలవరం మాత్రమే, ఈ పరిస్థితిలో ఉంది... దీనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ... అందుకే చంద్రబాబు ఎన్ని ఇబ్బందులు పడినా, తన నెత్తిన వేసుకుని పనులు పూర్తి చేస్తున్నారు... పోలవరం కూడా కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటే, మిగతా 15 ప్రాజెక్ట్ లు లాగా, మన పోలవరం కూడా ఇలాగే కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేస్తుంది... అందుకే చంద్రబాబు ప్రాజెక్ట్ బాధ్యతలు తీసుకుని, మీ లాంటి విమర్శలు చేసినా పడుతున్నారు... మీది రాజకీయం చెయ్యాలనే అనే సంకల్పం... చంద్రబాబుది ప్రాజెక్ట్ పూర్తి చెయ్యాలనే సంకల్పం...