రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అయ్యా అంటే, బీజేపీ రాష్ట్ర నేతలు తట్టుకోలేక పోతున్నారు... మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే అదో బూతులా చూస్తున్నారు... ఎంత సేపు మోడీకి, అమిత్ షా ని వెనుకేసుకుని రావటమే కాని, రాష్ట్రం కోసం కనీసం ఒక్క మాట మాట్లాడటం లేదు... తాజగా విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బీజేపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీని కించపరిచే చర్యలను టీడీపీ మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు, మాధవ్ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే టిడిపి అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు..
నిజానికి ఆ ఫ్లెక్స్ లో ఏమి అభ్యతరం లేదు "ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు వేసి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా అన్యాయంగా విభజించారని మీరు ఉద్వేగంతో మొన్న లోక్ సభలో చెప్పారు. దానికి మా కృతజ్ఞతలు.. మీరు ఈ రోజు బీజేపీ పాలనలో టీడీపీ తలుపులు బార్లా తెరిచి , విభజన హామీలను తుంగలో తుక్కుతున్నారు. దీంతో మా తెలుగు ప్రజలు భావోద్వేగంతో అందోళన చెందుతున్నారు. వాడవాడలా ఆవేదనతో గగ్గొలు పెడుతున్నారు. ఇప్పటికైనా మా హామీలు నెరవేర్చండి లేకుంటే జాతి మిమ్మల్ని క్షమించదు" అంటూ కాట్రగడ్డ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.
మరి దీంట్లో అభ్యంతరం ఏముంది ? 5 కోట్ల మంది ప్రజలు ఏమంటున్నారో, అదే ఉంది.. ఎక్కడా మోడీని కించపరుస్తూ లేదు... హామీని నెరవేర్చండి అంటే కూడా తప్పా ? దానికే టిడిపి అంతు చూస్తారా ? మరి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇదే అంటున్నారు... వారి అంతు కూడా చూస్తారా ? ఇప్పటికే ఒకాయిన అన్నాడు, నా జోలికి వస్తే, రాష్ట్రాన్ని కట్ చేస్తా అని.. అలాంటిది ఎమన్నా ప్లాన్ చేస్తున్నారా ? చేతనైతే, మీ అధిష్టానం దగ్గరకు వెళ్లి, మనకు రావాల్సిన దాని పై అడగండి...