ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్ని విభజన హామీల పియా పార్లమెంట్‌లో ఒత్తిడి తెస్తామని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు... పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు పట్టుపడతామని అన్నారు... ఏపీకి జరిగిన అన్యాయాన్ని యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లగలిగామని ఆయన చెప్పారు... వైఎస్ఆర్ పార్టీ ఢిల్లీకి వచ్చి సీఎం చంద్రబాబును విమర్శించడమేమిటని అవంతి మండిపడ్డారు... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏపీలోనే ఉంచుకుందామని అన్నారు... ఢిల్లీకి వచ్చి చంద్రబాబును, టీడీపీని విమర్శిస్తే పనులు అవుతాయని అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని అన్నారు. దేశానికి ప్రధాని చంద్రబాబా? లేక మోదీనా అంటూ విజయసాయి రెడ్డికి క్లిష్ట ప్రశ్న వేసారు ఎంపీ...
ఒక వంద మంది వైసిపీ కార్యకర్తలను ఢిల్లీలోని సంసద్ మార్గ్‌లో ఒక మీటింగ్ పెట్టి, చంద్రబాబుని తిడుతూ, మాట్లాడారు.. ఎక్కడా మోడీ అనే పేరు ఎత్తలేదు... అన్ని ప్లే కార్డులు తెలుగులో ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు... ప్రాంగాలు కూడా అన్నీ తెలుగులేనే... నేషనల్ మీడియాని కవేరేజ్ కి పిలవలేదు... చాలా జాగ్రత్తగా మోడీ పేరు, కేంద్రం పేరు ఎత్తకుండా, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, ఆందోళన చేసారు... మనలో మనమే, ఇలా ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటే, ఎవడికి లాభం ?
ఢిల్లీకి వచ్చి, ఉభయసభల్లో ఆందోళన చేస్తే, మిగతా ఎంపీలకు, అదే విధంగా టీవీలలో చూస్తున్న దేశానికి తెలుస్తుంది... అప్పుడు బీజేపీ పై ఎమన్నా ఒత్తిడి వస్తుంది... అంతే కాని, ఒక చోటు చేరి, అదీ ఇక్కడ నుంచి జనాలని తోలుకుపోయి... తెలుగులో మాట్లాడుతూ, మనలో మనమే ప్రసంగించుకుంటూ, చంద్రబాబుని తిడితే, కేంద్రం పై ఏమన్నా ఒత్తిడి ఉంటుందా ?