విలక్షణ నటుడు కమల్‌ హాసన్‌ రాజకీయ యాత్ర ప్రారంభమైంది... ఈ రోజు ఆయన కొత్త పార్టీ గురించి ప్రకటన చెయ్యనున్న సంగతి తెలిసిందే... ఈరోజు ఉదయం 8 గంటలకు కమల్‌ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం స్వస్థలం రామేశ్వరం చేరుకున్నారు. కలాం సోదరుడు మహమ్మద్‌ ముతుమీర లెబ్బాయ్‌కు చేతి గడియారం కానుకగా ఇచ్చారు. సాధారణ గృహాల్లో నివసించడంలోనే గొప్పతనం ఉందని.. కలాం వంటి గొప్ప వ్యక్తి పుట్టిన రామేశ్వరం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభించడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ అన్నారు. ఉదయం 9 గంటలకు ఆయన మత్య్సకారులతో సమావేశమయ్యారు... 10 గంటలకు హయత్‌ ప్లే్‌స్‌ హోటల్‌లో నిర్వహించనున్న ప్రెస్‌మీట్‌లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు... చంద్రబాబు నా హీరో అన్నారు...

kamal 21022018 2

కమల్‌ మాట్లాడుతూ..‘నేను మహాత్మా గాంధీ వీరాభిమానిని. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా హీరో. మంగళవారం రాత్రి చంద్రబాబు నాకు ఫోన్‌ చేశారు. ప్రజలకు ఏం చేయాలి అన్న విషయాల గురించి సలహాలు ఇచ్చారు. రాజకీయ యాత్రలో భాగంగా కార్యకర్తలు, అభిమానులు నన్ను కలవడానికి వచ్చి శాలువాలు కప్పుతున్నారు. ఇంకెప్పుడూ ఇలా నాకు శాలువాలు కప్పవద్దు. నేను మీ శాలువాగా మారి మీకు రక్షణ కల్పిస్తాను.’

kamal 21022018 3

ఇది వరకు కూడా కమల్ మాట్లాడుతూ, "ఐ యాం ఏ ఫ్యాన్ అఫ్ చంద్రబాబు నాయుడు" అని ఒక జాతీయ ఛానల్ ఇంటర్వ్యూ లో అన్నారు... "ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే, అన్ని విషయాలు గుర్తుకువస్తాయి.... ఆయన ఇది వారకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించారు... ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి నూతన రాష్ట్రానికి, మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు.... ఆయన పనితనం అద్భుతం (హీ ఈజ్ కమెండబుల్)... ఆయనకు చేతనైన దాంట్లో, ఆయన చెయ్యదగ్గ వరకు, ఆయన చేస్తున్నారు... హి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ అంటూ, అందుకే నాకు చంద్రబాబు అంటే ఇష్టం, అందుకే నేను చంద్రబాబుకి ఫ్యాన్ అంటూ, కమల్ హసన్ చెప్పారు..."

Advertisements

Advertisements

Latest Articles

Most Read