సీనియర్ ఐఎఎస్,ఐపిఎస్ అధికారులపై, A1 జగన్, A2 విజయసాయి రెడ్డి ఎలా రేచ్చిపోతున్నారో చూస్తున్నాం... జగన్ ఏమో, నెంబర్ వన్ ఐఎఎస్ ఆఫీసర్ గా పేరున్న అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబుని, జైలుకి తీసుకుపోతా అని అన్నారు... ఒక సందర్భంలో నందిగామలో ప్రభుత్వ డాక్టర్ల పై దౌర్జన్యం చేసారు.. ఇక విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ అయితే, నా భూతో న భవిష్యత్తు... ఒక ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నావ్ నువ్వు అంటూ, రెచ్చిపోయారు... ఇప్పుడు జగన్ బాటలోనే A2 విజయసాయి రెడ్డి నడుస్తున్నారు... మా జగన్ సియం అయిన వెంటనే, మేము కక్ష తీర్చుకునేది వారి పైనే అంటూ, ఒక లిస్టు మీడియా ముందు చదివి వినిపించారు...
సిఎంఒ ఇన్ఛార్జి సతీశ్చంద్ర, ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావుల సంగతి, ముఖ్యమంత్రిగా 'జగన్' ప్రమాణస్వీకారం చేసిన అరగంటనేలోనే చూస్తామని విజయసాయి రెచ్చిపోయారు.. దీని పై నిన్న రాష్ట్రంలోని ఐపీఎస్ ఆఫీసర్లు గెట్టిగా వార్నింగ్ ఇచ్చారు... ఇంటిలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు పై విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యల పై తీవ్ర అభ్యంతరం చెప్పింది... ఆ వ్యాఖ్యలు విజయసాయి రెడ్డి వెనక్కు తీసుకోవాలని, లేకపోతే తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించింది... ఈ రోజు సిఎంఒ ఇన్ఛార్జి సతీశ్చంద్ర పై చేసిన వ్యాఖ్యల పై, ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించింది...
సీనియర్ ఆఫీసర్ మీద, నిబద్దత కలిగిన ఆఫీసర్ మీద చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు... మేము ప్రభుత్వానికి, ప్రజలకు పని చేస్తామని, చౌకబారు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు... చెప్పారు... సతీష్ చంద్ర ఎంత నిజాయితీ గల అధికారో, అందరికీ తెలుసు అని, ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కు తీసుకుని, క్షమాపణ చెప్పాలని విజయసాయి ని కోరారు... అయితే ఆఫ్ ది రికార్డు మాట్లాడుతూ, గతంలో వీరి చేసిన అరాచకాలవల్లే కొంత మంది సీనియర్ ఐఎఎస్ అధికారులు జైలు పాలు అయ్యారని, మరి కొందరు అనారోగ్యాల పాలు అయ్యారని..వారు ఆరోపిస్తున్నారు. తాము ఎటువంటి తప్పులు చేయడం లేదని..ఒకవేళ చేస్తే..దానిపై తగిన ఫౌరంలలో ఫిర్యాదులు చేసుకోవచ్చని..అంతే కానీ..తమకు సంబంధం లేని విషయాల్లో ఆరోపణలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.