బొత్సా సత్యన్నారాయణ... ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు... తరువాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు అవ్వటం, తెలుగుదేశం పార్టీలోకి ఎంట్రీ లేకపోవటంతో, జగన్ పార్టీలోకి జంప్ చేసారు... జగన్ ని కలిసినప్పుడు, రాజ్యసభ సీటు ఆఫర్ మీద, బొత్సా పార్టీలో జాయిన్ అయ్యారు... అప్పట్లో విజయసాయి రెడ్డికి రాజ్యసభ సీటు ఇవ్వటంతో, బొత్సాకి నిరాస మిగిలింది.. అప్పట్లో, పార్టీకి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి వెల్లిపోదాం అని బొత్సా డిసైడ్ అయ్యారు... కాని, జగన్ బ్రతిమాలి, ఈ సారి రాజ్యసభ సీటు, కచ్చితంగా ఇస్తాను అని చెప్పి, బొత్సాను ఆపారు...
అయితే ఇప్పుడు అనూహ్యంగా, కాపా రాజ్యసభ అభ్యర్థిగా 'వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి'ని ప్రకటించడం పై, బొత్సా వర్గీయలు భగ్గు మన్నారు... కాపుల కోటాలో, బొత్సాకి రాజ్యసభ సీటు ఇస్తున్నాను అని చెప్పి, జగన్ మమ్మల్ని నమ్మించి మోసం చేసారు అని, బొత్సా వర్గీయులు అంటున్నారు... నిన్నకాక మొన్న పార్టీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, సీటు ఎలా ఇస్తారని ? ముందు నుంచి బొత్సాకే రాజ్యసభ అని, కాపులకి న్యాయం చేస్తాను అని చెప్పి, జగన్ మరోసారి మమ్మల్ని మోసం చేసారని అంటున్నారు... బొత్సా కూడా, ఈ నిర్ణయం పై, కోపంగా ఉన్నా, అటు తెలుగుదేశంలోకి ఎంట్రీ లేక, ఇటు జనసేనలోకి ఎంట్రీ లేక, ఏమి చెయ్యాలో అర్ధం కాక, అయోమయంలో ఉన్నారు...
అన్ని పదవులు ఒకే సామాజికవర్గానికి ఎలా ఇస్తారని, వైసిపీ లోని కాపు వర్గీయులు అంటున్నారు... ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు విజయసాయిరెడ్డికి, PACఛైర్మన్ ని కూడ బుగ్గన రాజేంద్రరెడ్డికి, పార్టీ అధ్యక్షుడు రెడ్డి, ఇలా అన్ని కీలక పదవులు రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే, ప్రజలకు ఏమి సంకేతాలు వెళ్తాయని ప్రశ్నిస్తున్నారు... రాష్ట్రంలో ఇన్ని కులాలు ఉండగా రెడ్లకు మాత్రమే రాజ్యసభ స్తానాలు కట్టబెట్టడం వెనుక ఆ ఫార్టీ అంతరంగం ఏంటి అని అంటున్నారు... మాట ఇచ్చిన కాపు సామాజికవర్గానికి, జగన్ ఏమి సమాధానం చెప్తారని అడుగుతున్నారు...