బెజవాడలో స్మార్ట్ పార్కింగ్ కు రంగం సిద్దమవుతోంది... నగరంలోని 20 ప్రాంతాల్లో ఇది ఏర్పాటు కానుంది.... రెండేళ్ల కాలానికి చెన్నైకు చెందిన స్మార్ట్ పార్కింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఏడాదికి రూ.2.25 కోట్లకు టెండరు చేజిక్కించుకుంది... 50 శాతం సొమ్మును వీఎంసీకి కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే చెల్లించింది.... మిగిలిన సొమ్ము ఈనెలలోనే చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలిసింది... ఈ స్మార్ట్ పార్కింగ్ విధానం, మార్చి 1 నుంచి అందుబాటులోకి రానున్నట్టు సమాచారం... ప్రస్తుతం కొనసాగుతున్న ధరలనే గంటల వారీ విభజించి స్మార్ట్ పార్కింగ్ స్థలాల్లో వాహనాలకు రుసుం వసూలు చేస్తారు.... సార్ట్ అమలు ఇలా... 20 స్మార్ట్ పార్కింగ్ స్థలాల పూర్తి డేటా కార్పొరేషన్ లోని కమాండ్ కంట్రోల్ రూం (సీసీఆర్)కు అనుసంధానిస్తారు... అక్కడ ఏం జరిగినా సీసీ కెమేరాల ద్వారా సీసీఆర్లో పరిశీలించే విధంగా ఏర్పాటు చేశారు.. పార్కింగ్ స్థలాన్ని ముందుగానే బుక్ చేసుకునేందుకు ప్రభుత్వ వెబ్ సైట్, ప్రత్యేక యాప్, ఆండ్రాయిడ్, ఇతర స్మార్ట్ ఫోన్ల ద్వారా ఆపరేట్ చేసుకునేలా అందరికీ అందుబాటులోకి తెస్తున్నారు...

smart parking 15022018 2

పార్కింగ్ గా ప్రకటించిన అన్ని పార్కింగ్ స్థలాల వివరాలు నమోదవుతాయి.. యాప్లోనే పార్కింగ్ నేవిగేషన్ ను కూడా పొందుపరుస్తున్నారు.... నగరంలోని అన్ని స్మార్ట్ పార్కింగ్ స్థలాలకు నెలవారీ పాస్లు, వన్టైమ్ కార్డ్ యాక్సెస్ తో పాటు డిజిటల్ పేమెంట్ సౌకర్యాన్ని అందించబోతున్నారు.... పార్కింగ్ రిజిస్ట్రేషన్ నెంబరుకు, టికెటింగ్ కోసం పార్కింగ్ వద్ద ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బంది అందుబాటులో ఉంటారు... టికెట్ ధరలను వాహనాలతో కాకుండా నిర్ణీత కాలపరిమితితో అనుసంధానించి పార్కింగ్ ధరలను నిర్ణయిస్తున్నారు. మొదటి మూడుగంటలకు ఒక ధర, అది దాటిన తరువాత నుంచి ప్రతి రెండు గంటలకూ మరో ధర నిర్ణయించారు... దీని ప్రకారం ద్విచక్ర వాహనానికి మొదటి మూడు గంటలకు 10 రూపాయలు, తరువాత గంట నుంచి 10 రూపాయలు వసూలు చేస్తారు... కారుకి మొదటి మూడు గంటలకు 30 రూపాయలు, తరువాత గంట నుంచి 20 రూపాయలు వసూలు చేస్తారు... అటోకి మొదటి మూడు గంటలకు 20 రూపాయలు, తరువాత గంట నుంచి 15 రూపాయలు వసూలు చేస్తారు...

smart parking 15022018 3

పార్కింగ్ స్థలాలు ఇవే.. హోటల్ రాజ్ టవర్స్ ఎదురుగా, హోటల్ రాజ్ టవర్స్ వద్ద పెట్రోలు బంకు వద్ద తూర్పు, పశ్చిమ, ఏలూరు రోడ్డులోని చల్లపల్లి బంగ్లా వద్ద ఆంధ్రా బ్యాంకు ఏటీఎం, లిబర్ట్ హెయిర్ స్టైల్స్ వద్ద, అప్సర థియేటర్ పరిసరాల్లోని నోకియా షోరూమ్ వద్ద, అప్పర థియేటర్ పరిసరాల్లోని స్వగృహ ఫుడ్స్ వద్ద, శ్రీరామ్ చిట్స్ వద్ద, ఎస్బీఐ ఏటీఎం వద్ద, ఏవీ ఆప్టిక్స్ షోరూమ్ వద్ద, పాజిటివ్ హోమియో వద్ద, రవి మెడికల్స్ వద్ద, బీవీఆర్ కాంప్లెక్సులోని సర్కిల్-4 కార్యాలయం, ఎన్టీఆర్ సెల్లార్ పార్కింగ్ స్థలం, కేబీఎన్ సెల్లార్ పార్కింగు స్థలం, బ్రహ్మానంద రెడ్డి సెల్లార్ పార్కింగ్ స్థలం, చుట్టుగుంట, గోవిందరాజులు పార్కింగు స్థలం, లెనిన్ సెంటర్, అన్సారీ పార్కులోని పార్కింగు స్థలం, గవర్నరుపేట, రాజీవ్ గాంధీ పార్కింగు స్థలం, వన్టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ సెల్లార్ పార్కింగు స్థలం..

Advertisements

Advertisements

Latest Articles

Most Read