ఆయన ఒక సీనియర్ రాజకీయవేత్త... ఆయన రాత బాగోక, రాజకీయాలకు దూరంగా ఉన్నాడు... ఇప్పుడు మళ్ళీ రాజకీయ గాలి మళ్ళింది... అటు తెలుగుదేశంలోకి వెళ్ళలేడు.. వెళ్దాం అన్నా రానివ్వరు... జనసేన పార్టీ పై ఇంకా క్లారిటీ లేదు... ఇక మిగిలింది జగన్ మోహన్ రెడ్డి... సీనియర్ అన్న విషయం కూడా పక్కన పెట్టి, జగన్ దగ్గరకు వెళ్లి, మీ పార్టీలో చేరదాం అనుకుంటున్నా అని జగన్ కు చెప్పారు.... అయితే, జగన్ చెప్పిన సమాధానంతో, ఇన్నేళ్ళు రాజకీయం చేసిన ఆ సీనియర్ కూడా, అవాక్కయ్యి, ఆ షాక్ నుంచి తేరుకుంటానికి కొన్ని రోజులు పట్టింది అని ఆయన సన్నిహితులు చెప్తున్నారు... ఇంతకీ జగన్ చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా..
“ఇప్పుడు మీరోస్తే, రేపు మంత్రి పదవులు అడుగుతారు. మన కేబినెట్ ఇప్పటికే ఫుల్లుయిపోయింది... నేను ప్రస్తుతం మీకు మంత్రి పదవులివ్వలేను... ఇప్పుడు వద్దులే.... మీరూ నామీద ఒత్తిడి తీసుకురావద్దు.... వదిలేయండి!" ఇదీ.. 30ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటున్న వైసీపీ అధినేత జగన్ తాజా వ్యవహార శైలి.... నేను మీ పార్టీలో చేరుతాను అన్న సందర్భంలో, తన మంత్రివర్గం కూర్పు అప్పుడే అయిపోయిందన్నట్లు మాట్లాడుతున్న జగన్ తీరు పై ఆ సీనియర్ నాయకుడు తెల్లబోయాడు... తాను చేస్తున్న పాదయాత్రతో, జగన్ తాను ఇప్పటికే సీఎం అయిపోయాననుకుని, కేబినెట్ కూర్పు కూడా పూర్తి చేసుకున్నట్లున్నారని జగన్ సన్నిహితుడు, ఆ సీనియర్ నేతకు చెప్పి పంపించి వేసారు...
నిజానికి గతంలో పార్టీకి పనిచేసి వివిధ కారణాలతో బయటకు వెళ్లినవారు, అటు తెలుగుదేశం పార్టీలోకి పెర్మిషన్ లేక, జనసేన పార్టీలోకి వెళ్ళే క్లారిటీ ఇంకా రాక, తిరిగి జగన్ దగ్గరకు వస్తామన్న సంకేతాలు పంపిస్తున్నారు... తిరిగి రావాలనుకుంటున్న నేతలు, ఆయా జిల్లాల వైసీపీ అగ్ర నాయకులతో చర్చించడమో, లేదా అగ్ర నాయకులే మాజీలతో మాట్లాడి తిరిగి పార్టీలోకి వస్తే బాగుంటుందని కోరడమో జరుగుతోంది. వారితో జిల్లాస్థాయిలో మాట్లాడిన తర్వాత, పార్టీ సీనియర్లు పాదయాత్రలో ఉన్న జగనను కలిసి వివరాలను ఆయన దృష్టికి తెస్తున్నారు. ఆ క్రమంలో జగన్ మన కేబినెట్లో ఇప్పు డు కొత్త వారికి స్థానం లేదని, అన్నీ పూర్తి అయిపోయాయని చెబుతున్నారు... పైగా ఫలానా నేత వస్తే కచ్చితంగా మంత్రి పదవి అడుగుతాడని, ఇప్పుడు అలాంటి వారికి పదవి ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నట్లు సమాచారం... దీంతో జగన్ వైఖరికి విస్తుపోయిన నేతలు తలపట్టుకుని బయటకు వస్తున్నారు... అసలు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఉంటారో లేదో అని అనుకుంటుంటే, మా వాడి వేషాలు ఇలా ఉన్నాయి అని, వైసిపీ నాయకులు అనుకుంటున్నారు...