మా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, మాకు చెప్పినవి చెయ్యండి, విభజన హామీలు, చట్టాలు అమలు చెయ్యండి అంటే, కనీస కనికరం లేదు, కేంద్రానికి... రాష్ట్ర ముఖ్యమంత్రికి అప్పాయింట్మెంట్ ఇవ్వండి అయ్యా అంటే, సంవత్సరం పాటు లేదు... కాని, దొంగలకి, దోపిడీదారులకి మాత్రం ఇస్తారు... సరే, ఒక ప్రధాని హోదాలో, ప్రోటోకాల్ ప్రకారం, గౌరవం ఇస్తూ, మేము మా రాష్ట్రంలో గొప్పగా సాధించుకున్నాం, ఈ ప్రపంచానికి ఆంధ్రా వాడి సత్తా చూపించాం, ప్రపంచ చరిత్రలో కర్నూల్ కి ఒక పేజీ రాసాం, ప్రధాని హోదాలో వచ్చి, ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టండి అని, రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ప్రధాని కార్యాలయాన్ని అడుగుతుంది...

cm relief fund 15022018 2

అతి పెద్ద సోలార్ పార్కును నిర్మించి ప్రపంచ దేశాలలో సోలార్ శకం తమదేనని చాటి చెప్పింది ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ఇంత పెద్ద భారీ సోలార్ పార్కు నిర్మాణం ఎక్కడా జరుగలేదు. ఒకే సారి ఒకేచోట వెయ్యి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాం, ప్రధాని వచ్చి ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే బాగుంటుంది అంటూ ముఖ్యమంత్రి కార్యాలయం, ప్రధని కార్యాలయానికి కొన్ని నెలలు క్రితమే అడిగింది... ఎన్ని సార్లు అడిగినా అటు వైపు నుంచి మాత్రం ఏ సమాధనం లేదు... ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రధాని వచ్చే అవకాసమే లేదు... మరి ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి...

cm relief fund 15022018 3

పెద్ద సోలార్ పార్కులు ప్రపంచంలో ఇప్పటిదాకా రెండు దేశాలలోనే ఉన్నాయి. అందులో కూడా తమిళనాడులో అదాని పవర్ కంపెనీ 648 మెగావాట్లతో నిర్మించగా, కాలిఫోర్నియాలో 550 మెగావాట్లతో ఉంది. ఈ రెండు పార్కులను వెనక్కినెట్టి వేసిన కర్నూలు 1000 మెగావాట్లతో అవతరించింది. మొత్తం 7 వేల కోట్లతో చేపట్టిన దీనిని ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పోరేషన్ 50 శాతం ఎస్ఇసిఐ 41 శాతం ఎపిజెన్కో 8 శాతం సంయుక్త భాగస్వామ్యంతో నిర్మించాయి.... ఇవి ప్రారంభించమని మనం గౌరవంగా, ప్రధాని హోదాకు విలువ ఇస్తూ, ఆయన్ను పిలిచాం... ఆయనకు మన రాష్ట్రం అంటేనే మంట... వస్తాడు అనే ఆశ లేదు... మన ప్రాజెక్ట్ మనమే ప్రరంభించుకుందాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read