అమరావతి నిర్మాణం కోసం, చంద్రబాబు ఒక అడుగు వేస్తుంటే, "జే" బ్యాచ్ వంద అడుగులు వెనక్కు వేస్తుంది... మళ్ళీ ఈ వంద అడుగులు పూర్తి చేసి, తొలి అడుగు వేసే లోపు, మరోసారి "జే" బ్యాచ్ ఇంకో రూపంలో, అడ్డుపుల్లలు వేస్తుంది... ఒక పక్క కేంద్ర పెడుతున్న ఇబ్బందులు, మరో పక్క "జే" బ్యాచ్ అరాచకాలతో, అమరావతి నిర్మాణానికి అడ్డుపుల్లలు వేస్తూనే ఉన్నారు... ఇవన్నీ తట్టుకుని చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు... 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల భవిష్యత్తు చంద్రబాబు చేతులో పెట్టుకుని, వారి నమ్మకాన్ని ముందుకు తీసుకు వెళ్తున్నారు... వీళ్ళు మాత్రం, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేస్తారు, కోర్ట్ ల్లో కేసులు వేస్తారు, ప్రపంచ బ్యాంకుకి ఉత్తరాలు రాస్తారు.... మళ్ళీ వచ్చి, చంద్రబాబునే తిడతారు... అమరావతి ఎంత వరకు వచ్చిందని, పిల్లి బిత్తిరి గాళ్ళు, మీడియా చర్చల్లో హైదరాబాద్ నుంచి ఫోజ్ కొడతారు...
ఈ సారి ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు వంతు.... చంద్రబాబు ఇచ్చిన పోస్ట్ లో ఉంటూ, చంద్రబాబునే తిడుతూ, పదవి ఊడబీక్కుని, అప్పటి నుంచి, హైదరాబాద్ లో కూర్చుని, అమరావతి పై విషం చిమ్ముతూనే ఉన్నారు... అమరావతి స్టార్టప్ ప్రాతం అభివృద్ది కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ ఛాలెంజ్ విధానాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో కేసు వేసారు ఐవైఆర్... స్విస్ ఛాలెంజ్ నిమిత్తం జారీ చేసిన జీవోలను వ్యాజ్యంలో సవాలు చేశారు. వాటిని చట్ట విరుద్దమైనవిగా, రాజ్యాంగ విరుద్దమైనవిగా ప్రకటించాలని కోరారు.
సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించడాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని అభ్యర్ధించారు. ప్రాజెక్ట్ ప్రధాన ప్రతిపాదకుడు(ఓపీపీ).. రాష్ట్ర ప్రభుత్వం మధ్య రాసుకున్న ఒప్పందాలు చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించాలని కోరారు.. స్విస్ ఛాలెంజ్ విపై ప్రభుత్వం తన చర్యలకు చట్టబద్ధత చేసుకునేందుకు ఏపీఐడీ ఈ చట్టానికి సవరణ చేసి 'ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అథార్టీ' స్థానంలో ప్రభుత్వం' అనే పదాన్ని చేర్చారన్నారు... ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రభుత్వం చేపడుతున్న పనుల్ని నిలువరించాలని కృష్ణారావు కోరారు.... వచ్చే మంగళవారం ఈ వ్యాజ్యం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది....