కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రెస్‌మీట్‌ తర్వాత అమరావతిలో ఎంపీలతో, మంత్రులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేశారు. చంద్రబాబుతో మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, ఇతర మంత్రులు భేటీ అయ్యారు. ఢిల్లీ నుంచి కేంద్రమంత్రులు, ఎంపీలు టెలికాన్ఫరెన్స్‌లో పాల్గున్నారు... పొత్తు పై ఎంపీలు , ఎమ్మెల్యేలు కూడా ఒకే మాట మీద ఉన్నారు... ఇన్నాళ్లూ ఓర్పు, సహనంతో.. మిత్రధర్మంతో ఉన్నానని.. కానీ ఇలా చేయడం అన్యాయమని మంత్రులు, ఎంపీల దగ్గర సీఎం చంద్రబాబు వాపోయారు... దీంతో ముందు అడుగుగా ఆశోక గజపతి రాజు, సుజనా చౌదరి ముందుగా రాజీనామా చేయ్యనున్నట్టు సమాచారం...

cbn rajeenama 07032018

మరి కొంత సేపట్లో చంద్రబాబు ఈ నిర్ణయం ప్రకటించనున్నారు... ముందుగా ఈ విషయం నరేంద్ర మోడీ, అమిత్ షా తో చెప్పి రాజీనామా చెయ్యనున్నారు.. అందుకే 8 గంటలకు రావాల్సిన నిర్ణయం లేట్ అయ్యింది... ఈ నేపధ్యంలో రేపు ఉదయం మంత్రులు రాజీనామా చెయ్యనున్నారు... అయితే మంత్రి ఆశోక గజపతి రాజు కొన్ని కార్యక్రమాల్లో ఉండటంతో అందుబాటులో లేనట్టు సమాచారం... ఆయన ఇప్పటికే మీరు ఎప్పుడు అంటే అప్పుడు రాజీనామా ఇచ్చేస్తా అని ఇప్పటికే చెప్పారు కూడా... రేపు రాష్ట్రపతిని కలిసి రాజీమాలు ఇస్తారని సమాచారం..

cbn rajeenama 07032018

అయితే ఎన్డీఏ నుంచి బయటకు రావటం మీద కూడా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు... ముందుగా మంత్రుల చేత రాజీనామా చేసి, కేంద్రం పై ఏమన్నా ఒత్తిడి వస్తుందేమో చూడనున్నారు.. అలాగే ఇక్కడ కేంద్ర మంత్రులు రాజీనామా చెయ్యగానే, రాష్ట్ర బీజేపీ మంత్రులు కూడా రాజీనామా చేయ్యనున్నట్టు సమాచారం... అయితే ముందుగా ఆశోక గజపతి రాజుతో మాట్లాడి, తరువాత మోడీకి విషయం చెప్పి, చంద్రబాబు ఈ నిర్ణయం మరికొంత సేపట్లో చంద్రబాబు నిర్ణయం ప్రకటించనున్నారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read