ఏపీకి జరిగిన అన్యాయం నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించారు... కేంద్ర మంత్రి వర్గం నుంచి టీడీపీ బయటకు వస్తున్నట్టు ప్రకటించారు... చంద్రబాబు ఆదేశాల ప్రకారం కేంద్ర కేబినెట్‌లో ఉన్న అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి వైదొలగనున్నారు. మరో పక్క ఇదే నిర్ణయం చెప్పటానికి, ప్రధాని మోడీకి ఫోన్ చేసినా, ఆయన అందుబాటులో లేరని చంద్రబాబు చెప్పారు... రాష్ట్రానికి జరిగిన అన్యాయం నేపధ్యంలో, మొదటి అడుగుగా కేంద్రం నుంచి వైదొలుగుతున్నామని చంద్రబాబు చెప్పారు... ఏన్డీఏలో నుంచి బయటకు రావటం తరువాత అడుగని చెప్పారు...
రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అని, అందుకే మంత్రివర్గంలో చేరామని, కాని రాష్ట్రానికి ఏ మంచి జరగలేదని, అందుకే ఇక క్యాబినెట్ లో ఉండటం కరెక్ట్ కాదని బయటకు వస్తున్నామని చెప్పారు... ఎంతో ఓపికగా, అందరూ ఎప్పుడో వచ్చేయమని చెప్పినా, రాష్ట్ర పయోజనాల కోసం ఇన్నాళ్ళు ఎదురు చూసామని చంద్రబాబు అన్నారు... కాని, చివరకు ఈ బాధాకరమైన నిర్ణయం తీసుకోవాలసి వచ్చిందని చంద్రబాబు చెప్పారు.. కేంద్ర కేబినెల్‌లో ఉన్నప్పటికీ రాష్ట్రానికి న్యాయం జరగడంలేదనే ఉద్దేశంతోనే కేంద్రమంత్రులు రాజీనాచేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
మరో పక్క, సీఎం చంద్రబాబు కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజుకి ఫోన్ చేశారు. అరుణ్ జైట్లీ తర్వాత పార్టీ నిర్ణయాన్ని అశోక్ గజపతికి రాజుకి వివరించారు. బీజేపీతో పొత్తుపై తమరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సిద్ధమేనని చంద్రబాబుతో అశోక్ గజపతిరాజు చెప్పారు. కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదని అశోక్ గజపతి తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుందామని స్పష్టం చేశారు.