అలుగుటయే ఎరుగని చంద్రబాబు అలిగితే.... ఎలా ఉంటుందో చెప్పటానికి ఇది ఒక ఉదాహరణ... మిత్ర ధర్మం పాటిస్తూ, 3.5 సంవత్సరాలు ఓర్పుగా, ఆయానకు ఉన్న హోదా, అనుభవం అన్నీ పక్కన పెట్టి, 29 సార్లు ఢిల్లీ వెళ్లి, మాకు సహాయం చెయ్యండి అయ్యా, మా హక్కులు మాకు ఇవ్వండి అని వేడుకుంటే, చివరకు ఢిల్లీ పెద్దలు ఏమి చేసారో తెలిసిందే... ఇనుముని సైతం నానా పెట్టే చంద్రబాబు, లాంటి వాడే వీళ్ళ పనులకి ఓర్పు నశించి బయటకు వస్తున్నారంటే, బీజేపీ పెద్దలు ఎలా ఇబ్బంది పెట్టారో తెలుసుకోవచ్చు... అయితే, మనకు కళ్ళకు కనిపించింది చాలా తక్కువ, అంతకు మించి మోడీ ఎలా ఇబ్బంది పెట్టారో, అతని నైజం ఏంటో చెప్పటానికి, నిన్న చంద్రబాబు ఆవేదనతో చెప్పిన ఒక విషయం తెలుసుకోవాలి...

cbn 08032018 2

ఏపీకి సహాయంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మాట్లాడిన తరువాత, చంద్రబాబు రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, ఎన్డీఏ నుంచి మా మంత్రులు బయటకు వస్తున్నారు అని చెప్పేశారు.. ఈ సందర్భంలో చంద్రబాబు చెప్పిన ఒక విషయం విస్మయానికి గురి చేసింది... మనం ఫెడరల్ సిస్టంలోనే ఉన్నామా, లేదా అనే అనుమానం కలుగుతుంది... కేంద్రం చేస్తున్న అన్యాయం చెప్తూ, చంద్రబాబు ఒక విషయం చెప్పారు.. ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం అది... చంద్రబాబు మాటల్లో "వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఈ ఏడాది జనవరి 31వ తేదీన రూ.350 కోట్లు విడుదల చేశారు. కానీ... ప్రధాని ఆమోదం లేదంటూ వెంటనే మొత్తం డబ్బు వెనక్కి తీసుకున్నారు. దీనిని సాయమనాలా, మరింకేదైనా అనాలా?"

cbn 08032018 3

ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం తెలియచేసే సంఘటన... డబ్బులు మన ఎకౌంటు లో వేసి, ప్రధాని వద్దు అన్నారని మళ్ళీ వెనక్కు తీసేసుకున్నారు అంటే, వీరు ఎలాంటి వారో అర్ధమవుతుంది... మరో పక్క, అసలు మోడీ ఇలా ఎందుకు చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి... మనం ఏమి అన్యాయం చేసాం ? చంద్రబాబుని సాధించటం కోసం, ప్రజలని ఇబ్బంది పెడతారా ? ఒక పక్క రాయలసీమకు అన్యాయం జరిగింది అని గగ్గోలు పెడుతున్న రాష్ట్ర బీజేపీ నేతలు, మోడీ చేసిన పనికి ఏమి సమాధానం చెప్తారు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read