నవ్యాంధ్ర జీవనాడి మీద కేంద్రానికి కన్ను పడింది.... దాన్ని ఎలా అయినా ఆపాలి అనే ఉద్దేశంతో ముందు నుంచి, పిర్ర గిల్లి, జోల పాడుతూ వస్తున్న కేంద్రం, ఇక డైరెక్ట్ గా రంగంలోకి దిగి, ఏకంగా పోలవరం ప్రాజెక్టులో కాఫర్ డ్యాం నిర్మాణం ఆపెయ్యమంది... ఈ కాఫర్ డ్యాం నిర్మించడం అవసరమా లేదా అన్నది తేల్చాలని, ఇందుకు ఓ కమిటీ వేస్తామని చెప్పెంది... ఆ కమిటీ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అధ్యనయం చేసి నివేదిక ఇచ్చిన తర్వాత కాఫర్ డ్యాం పై నిర్ణయం చెప్తాం అని చెప్పింది.. అంటే, ఇక ఇప్పట్లో అది జరిగే పని కాదు.... కాఫర్ డ్యాం నిర్మిస్తేనే 2019 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వటం కుదురుతుంది... అందుకే, ఈ కాఫర్ డ్యాం నిర్మాణం లేట్ చేస్తే, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుని దెబ్బ తియ్యాలి అని, రాజకీయ నిర్ణయం తప్ప, ఈ నిర్ణయం దేనికీ పనికిరాదు...

polavaram 08112017 2

కాఫర్ డ్యాం కట్టటానికి ప్రధాన కారణం, ఏదైనా ప్రాజెక్టులో మెయిన్ డ్యాం నిర్మాణానికి ముందే ఎగువన, దిగువన కాఫర్ డ్యాంలు నిర్మిస్తారు. వరద నీటిని వాటి ద్వారా మళ్లించి పనులు సులభంగా, త్వరగా అయ్యేలా చేస్తారు. ఇది పోలవరం లాంటి అతి పెద్ద ప్రాజెక్ట్ కు చాలా అవసరం... కాఫర్‌ డ్యాం ఎత్తును 42 మీటర్లకు పెంచుకుంటే 2018 జూన్‌ తర్వాత నీళ్లు కాలువలకు వదిలిపెట్టి, ప్రధాన డ్యాం నిర్మాణం చెయ్యవచ్చు అనేది చంద్రబాబు ఆలోచన.. ఆ మేరకు ప్రతిపాదనలు, చర్చలు, కేంద్ర జలసంఘం పరిశీలనకు వెళ్లాయి. కేంద్ర జలసంఘం కాఫర్‌ డ్యాం ఎత్తు మీ ఇష్టం అని కూడా చెప్పింది.. కాని ఇప్పుడు మళ్ళీ, ఈ ప్రాజెక్టుకు కాఫర్ డ్యాం అవసరమే లేదు.. దానికి ప్రత్యామ్నాయంగా కూడా పనులు చేయవచ్చు.. నిపుణులను పంపి అధ్యయనం చేసి తర్వాత ఆలోచిద్దాం.. అప్పటిదాకా పనులు ఆపేయండి అంటూ కేంద్రం ఆదేశించింది....

polavaram 08112017 3

ఇది నయవంచన అంటున్నాయి రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు... దీనిని పూర్తి చేయాలనే సంకల్పం రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతగా ఉన్నప్పటికీ కేంద్రం వేసిన బ్రేకుల నేపథ్యంలో పని జరిగేదెలాగ అంటూ ప్రశ్నిస్తున్నాయి... చంద్రబాబు ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసి, రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి అని చూస్తుంటే, ఆదుకోవల్సింది పోయి, రాజకీయ నిర్ణయాల కోసం, రాష్ట్రాన్ని బలి చేస్తున్నారని అంటున్నారు... ఒక పక్క తెలంగాణా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు అన్ని అనుమతులు ఇస్తూ, పోలవరం విషయంలో, ప్రతి సందర్భంలో కొర్రీలు పెడుతున్నారని అంటున్నారు... అమరావతి భూ సేకరణ బిల్లు కూడా ఇలాగే ఆపేసారని, తెలంగాణా, గుజరాత్ బిల్లులు ఒకే చేసారని అంటున్నారు..... చంద్రబాబు ఓర్పుని పరీక్షిస్తే, అసలుకే మోసం వస్తుంది అనే విషయం కేంద్రం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది... ఇప్పటికే నోట్లు రద్దు అని, GST అని ప్రజలని నానా ఇబ్బందులు పెడుతున్న కేంద్రం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది... చంద్రబాబు లాంటి మిత్ర పక్షం, ధిక్కార ధోరణి చూపిస్తే, రాజకీయంగా బీజేపికి అనేక ఇబ్బందులు మొదలవుతాయి... ఇప్పటి వరకు, రాజకీయంగా రాష్ట్రంలో బీజేపి నాయకులు ఎన్ని పిచ్చి వాగుళ్ళు వాగినా, చంద్రబాబు సంయమనం పాటిస్తూ ఉండమన్నారు... మిత్ర ధర్మం పాటిస్తూ వచ్చారు... ఆయన ఆశయమే పోలవరం, అమరావతి... వీటికి కొర్రీలు పెడుతూ, ఆయన సహనాన్ని పరీక్ష పెడుతున్న బీజేపి కేంద్ర నాయకత్వం, రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఏంటో తెలుసుకుని నడుస్తుంది అని ఆశిద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read